GET MORE DETAILS

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం (ప్రపంచ మత్తు మందు దినోత్సవం)

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం (ప్రపంచ మత్తు మందు దినోత్సవం)




1846కు మందు ఒక మనిషికి శస్త్రచికిత్స చేయాలంటే వైద్యులు, నర్సులు కాకుండా అదనంగా పదిమంది మనుషులు గట్టిగా పట్టుకుంటే కానీ పనిజరిగేది కాదు. అలాంటి సమయంలో అమెరికాలోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్టోబర్‌ 16న గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు ప్రముఖ దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి ఈథర్‌ మత్తు మందు ఇచ్చి దిగ్విజయంగా ఆపరేషన్‌ చేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అప్పటి నుంచి ఏటా అదే రోజున ప్రపంచ అనస్తీషియా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇది వైద్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మత్తు మందు కనిపెట్టిన తరువాత శస్త్రచికిత్స చాలా సులువైంది. బాయల్స్‌ అనే అనెస్తీషియా మిషన్‌ కనిపెట్టారు. ఈ మిషన్‌ అన స్తీషియా విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చింది. దీని ద్వారా ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ అనెస్తీషియా వాయువులను నిర్ధిష్టమైన ప్రమాణంలో రోగి శరీరంలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. మాజిల్‌, రియోబోతమ్‌ ఎండోట్రాకియల్‌ ట్యూబ్‌ అంటే స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలిని అందించేందుకు ఒక గొట్టాన్ని జనరల్‌ అనెస్తీషియా ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

Post a Comment

0 Comments