GET MORE DETAILS

DRDO లో డిప్లొమా,డిగ్రీవారికి ఉద్యోగాలు

 DRDO లో డిప్లొమా,డిగ్రీవారికి ఉద్యోగాలు





డిఫెన్స్ రీసెర్చ్ & డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) కు చెందిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ & డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.


పలు ఉద్యోగాల భర్తీకి నోనిఫికేషన్ భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో 12, కంప్యూటర్ సైన్స్ విభాగంలో మరో 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు :

✔ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సెంటర్ విభాగంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనుండగా డిగ్రీ, డిప్లొమో చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

1. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టులో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థుల కోసం 8 ఖాళీలు కేటాయించారు.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.

2.లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా చేసిన అభ్యర్థుల కోసం మరో 4 ఖాళీలు ఉన్నాయి.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.


✔ కంప్యూటర్ సైన్స్ విభాగంలో మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ (B.E/B.Tech) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల స్టైఫండ్ చెల్లించనున్నారు.

2.కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల వరకు స్టైఫండ్ చెల్లించున్నారు.

ఇతర పూర్తి వివరాలు :

-అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

-ఎంప్లాయిమెంట్ న్యూస్ లో అడ్వర్టైజ్మెంట్ వచ్చిన అనంతరం 21 రోజుల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

-అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

-అయితే అప్రంటీస్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ముందుగా http:// portal.mhrdnats.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

-ఏదైనా ఇతర సంస్థలో అప్రంటీస్ షిప్ చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు.

-2019, అనంతరం పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments