GET MORE DETAILS

మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత

 మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత




యాడికి:

✰ అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

✰ మధ్యాహ్న భోజనం తిని 12 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు.

✰ ఇవాళ మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మొదటగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

✰ వెంటనే ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

✰ వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

✰ అక్కడ చిన్న పిల్లల వైద్యులు లేనందున తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లాల్సిందిగా సూచించారు.

✰ అక్కడనుంచి మొదటగా ఏడుగురిని అంబులెన్స్‌లో తాడిపత్రికి తరలించారు.

✰ తాడిపత్రిలో ఏడుగురికి చికిత్స అందిస్తున్న సమ యంలోనే మరో 8 మంది అస్వస్థతకు గురయ్యారు.

✰ అయితే అస్వస్థతకు గురైన చిన్నారులు మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తు న్నారని సమాచారం.

✰ మానసిక స్థితి సరిగా లేని వారి విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది.

✰ తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

✰ ప్రథమ చికిత్స అనంతరం 12 మందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

✰ ప్రస్తుతం విద్యార్థులు అంతా అక్కడ చికిత్స పొందుతున్నారు.

✰ ఈ పాఠశాలలో 18 మంది విద్యార్థులుండగా వీరికి మధ్యాహ్న భోజనం మెనూలో అన్నం, ఆకుకూరపప్పు, చిక్కీలు, కోడిగుడ్లు వడ్డించారు.

✰ వీరికి వడ్డించిన మధ్యాహ్న భోజనం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు పర్యవే క్షణలో కాకుండా ఏజెన్సీ నిర్వాహకురాలు తన ఇంటి వద్దనే వండుకొని వచ్చి వడ్డించిందని, అక్కడే ఏదో జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొం టున్నారు.

Post a Comment

0 Comments