రెండుగా చీలనున్న గోద్రేజ్...! 124 ఏళ్ళబంధం
సబ్బుల నుండి గృహోపకరణాలు , రియల్ ఎస్టేట్ వరకు వ్యాపారాలను కలిగి ఉన్న 4.1 బిలియన్ గోద్రెజ్ గ్రూప్ ఇద్దరు సోదరుల మధ్య విడిపోయేందుకు సిద్ధపడుతోంది. వార్తా సంస్థ PTI లో ఒక నివేదిక ప్రకారం 124 ఏళ్ల ఈ వ్యాపార సామ్రాజ్యం ఇప్పటికే ఆస్తుల పంపకానికి సంబంధించి న్యాయ సహాలను సైతం తీసుకుంటున్నారని తెలిపింది.
నిజానికి గోద్రేజ్ గ్రూప్ చైర్మన్‌గా ప్రస్తుతం ఆది గోద్రేజ్(79) ఉన్నారు. ఆయనే దగ్గరుండి అన్ని వ్యాపారాలను నడిపిస్తున్నారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ అ్రగోవైట్‌కు ఆయన సోదరుడు నదీర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
వార్తల ప్రకారం ఒకదానికి ఆది, నాదిర్ నేతృత్వం వహిస్తారు. మరో దాన్ని జంషీద్, ఆయన సోదరి స్మితా గోద్రెజ్ కృష్ణా నిర్వహిస్తారు. ఆది , నాదిర్ కజిన్ జంషెడ్ గోద్రెజ్ గోద్రెజ్ & బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్. ఇది గోద్రెజ్ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ సంస్థ. దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటి. దీనిని 1897లో ఆర్దేషిర్ గోద్రేజ్ స్థాపించారు. కొన్ని విఫల ప్రయత్నాల తర్వాత అతను గోద్రేజ్ తాళాల పరిశ్రమతో విజయం సాధించాడు.
గోద్రెజ్ కుటుంబం సంయుక్త ప్రకటన విడుదల :
గోద్రెజ్ కుటుంబం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, "గోద్రెజ్ కుటుంబం దాని వాటాదారుల ప్రయోజనాలను సంరక్షించడానికి గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికపై పని చేస్తోంది." ఇందులో భాగంగానే దీనిపై బాహ్య భాగస్వాముల నుంచి కూడా సలహాలు కోరినట్లు తెలిపింది. కుటుంబ సభ్యుల మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి.
గోద్రేజ్ గ్రూపు కింద ప్రధాన కంపెనీలు :
గోద్రెజ్ గ్రూప్‌లోని ప్రమోటర్లలో 23 శాతం మంది పర్యావరణం, ఆరోగ్యం , విద్య రంగాలలో పెట్టుబడి పెట్టే ట్రస్ట్‌లలో ఉన్నారు. ప్రధాన గ్రూప్ కంపెనీలలో ప్రధాన జాబితా చేయని ఇంజనీరింగ్ సంస్థ గోద్రెజ్ & బోయ్స్ Mfg కంపెనీ లిమిటెడ్ , గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, గోద్రెజ్ అగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ , గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ ఎంటిటీలు ఉన్నాయి.
తమకు సన్నిహితులైన బ్యాంకర్లు నిమేశ్ కంపాని, ఉదయ్ కొటక్ న్యాయరంగంలోని జియామోడీ, సిరిల్‌ష్రాఫ్ తదితరుల సలహాలను గోద్రేజ్ గ్రూప్ తీసుకుంటుందని సమాచారం. గ్రూపుల్లో ఉన్నా 23 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా ట్రస్టుల్లో ఉందన్నారు. కుటుంబ సభ్యులకు గ్రూపుల్లోని అన్ని వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు వ్యాపార బాధ్యతలు తీసుకోవడంతో ఆది గోద్రేజ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
0 Comments