GET MORE DETAILS

ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి ?

ఒంటెలు ఎడారులలో చాలా కాలం నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి ?




ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థమే. మండుటెండల్లో ఏమాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తిసామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాలలో కొవ్వు కొంత కరిగిపోయి వదులవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిముషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు.

Post a Comment

0 Comments