GET MORE DETAILS

ఆరోగ్యమే మహా భాగ్యం

 ఆరోగ్యమే మహా భాగ్యం




క్యాప్సికమ్‌తో అదిరే బెనిఫిట్స్...!

క్యాప్సికమ్‌ చాలా మంది ఇష్టపడరుగానీ.. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. క్యాప్సికమ్‌ తరచూ తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

☛ నొప్పులను తగ్గించే లక్షణాలు వీటిలో ఉంటాయి.

☛ మొటిమలు తగ్గించి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

☛ జట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి.

☛ కొన్ని రకాల క్యాన్సర్లు నివారించగలవు.

☛ శరీర బరువు అదుపులో ఉంచుతాయి.

☛ డయేరియా, కడుపులో మంట వంటి సమస్యలను దూరం చేస్తాయి.


మిగిలిన ఆహారాన్ని తర్వాత తినేయొచ్చా...?

మనలో చాలామంది ముందురోజు మిగిలిన ఆహారాన్ని మర్నాడు వేడి చేసుకుని తింటుంటారు. కానీ ఇలా చేయడం వలన జీర్ణ సమస్యలు సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వండిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టినా అందులో బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. అటు ఒకసారి వండిన ఆహారాన్ని తిరిగి వేడి చేయడం ద్వారా పోషకాలు నశిస్తాయట. కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినడమే మేలు.


మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి...

1. కంటినిండా నిద్రపోవాలి.

2. యోగా, వ్యాయామం చేయండి.

3. ధ్యానం, సంగీతం ద్వారా ఒత్తిడి తగ్గించుకోండి.

4. డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండండి.

5. స్నేహితులతో ముచ్చట్లు చెబుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయండి.

6. సూర్యకాంతి పడేలా చూసుకోండి.


పనసతో ప్రయోజనాలెన్నో..!

> ఇందులోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్‌పై పోరాడుతాయి

> ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి

> రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

> పనస తొనలు తింటే మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది

> రక్తహీనత సమస్య గల వారికి బాగా ఉపయోగపడుతుంది

> ఇందులోని సోడియం అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది

> ఆస్తమా, గుండెపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది


షుగర్ ఉందా? తప్పనిసరిగా తాగండి : 

ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15నిమిషాల్లో తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి డయాబెటిస్, ఫ్రీ రాడికల్స్‌ వ‌ల్ల‌ కలిగే వ్యాధులతో పోరాడుతాయి. దానిమ్మ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లకు ఇది అద్భుతంగా పని చేస్తుంది. దానిమ్మలో తక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్‌ జీవక్రియ రేటు పెంచుతాయి.


Post a Comment

0 Comments