Ads Area

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల తాత్కాలిక మెరిట్‌ లిస్టు విడుదల - 6లోగా అభ్యంతరాల స్వీకరణ

0

 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల తాత్కాలిక మెరిట్‌ లిస్టు విడుదల - 6లోగా అభ్యంతరాల స్వీకరణ

 


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పిహెచ్‌సి) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల (సిఎఎస్‌) తాత్కాలిక మెరిట్‌ జాబితాను వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. పిహెచ్‌సిలలో 264 సిఎఎస్‌ల నియామకం కోసం ప్రభుత్వం గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా పోస్టులకుగానూ 3,038 మందితో కూడిన తాత్కాలిక మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరు డాక్టర్‌ జి.హైమావతి తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి ఆరో తేదీలోగా casrecruitmentdphfw2021@gmail.com కు పంపించాలన్నారు. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపారు. గడువు దాటిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area