GET MORE DETAILS

ఎస్ బి ఐ రుణాలు ప్రియం

ఎస్ బి ఐ రుణాలు ప్రియం



ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయిం ట్లను పెంచుతూ ఎస్బీఐ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. పెంపుతర్వాత బేస్ రేట్ 7.55 శాతానికి చేరింది. దీంతో గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలన్నీ కాస్త భారమవుతాయి. ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై మార్పులేవీ చేయకపో యినా, ఈ ప్రభుత్వ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం. మరోవైపు ఎస్బీఐ రూ.2 కోట్లు పైబడిన ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపా జిట్లపై వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది.

Post a Comment

0 Comments