GET MORE DETAILS

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్), మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్), మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు



భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), మచిలీపట్నం(ఏపీ) యూనిట్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15

పోస్టుల వివరాలు: ఎలక్ట్రానిక్స్‌–06, మెకానికల్‌–06, కంప్యూటర్‌ సైన్స్‌–03.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.» వయసు: 01.11.2021 నాటికి 28ఏళ్లు మించకుండా ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)లో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, వైవా వాయిస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కుల్లో.. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 15 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్‌(హెచ్‌ఆర్‌), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రోడ్, మచిలీపట్నం–521001, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021

వెబ్‌సైట్‌: bel-india.in

Post a Comment

0 Comments