విదేశాల్లో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వాలి - తల్లిదండ్రుల పాదయాత్ర. అడ్డుకున్న పోలీసులు
విదేశాల్లో చదువుకునే వారికి ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయాలని రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి దాకా తలపెట్టిన పాదయాత్రను ఆర్కేవ్యాలీ పోలీసులు అడ్డుకుని వారిని వెనక్కి పంపించారు. అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, సహా పలు జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఇడుపులపాయ వచ్చారు. వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించి, వైఎస్సార్ సమాధికి, విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. పాదయాత్రగా బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఆర్కేవ్యాలీ ఎస్‌ఐ రంగారావు వారిని అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆటోల్లో వెనక్కు పంపించారు.
0 Comments