GET MORE DETAILS

క్యాన్సర్ వ్యాధిని నిరోధించే బిర్యానీ ఆకు. ఇది మాత్రమే కాదు మరెన్నో బెనిఫిట్స్...!

క్యాన్సర్ వ్యాధిని నిరోధించే బిర్యానీ ఆకు. ఇది మాత్రమే కాదు మరెన్నో బెనిఫిట్స్...!


బిర్యానీ ఆకులని (Bay leaves ) మసాలా వంటలలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది వంటలకు మంచి సువాసన అందించడంతో పాటు రుచిని కూడా కలిగిస్తుంది. బిర్యానీ ఆకులలో అనేక ఔషధ గుణాలు దాగివున్నాయి. బిర్యానీ ఆకులను ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకు శరీరానికి కావలసిన పోషక పదార్థాలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బిర్యానీ ఆకుకు అనేక రోగాలను నశింపజేసే సామర్థ్యం ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా బిర్యాని ఆకుతో కలిగే హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits) గురించి తెలుసుకుందాం.

బిర్యానీ ఆకులను బేలీప్స్ అని కూడా అంటారు. బిర్యానీ ఆకులు విటమిన్ ఎ, విటమిన్ సి, సోడియం, పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బిర్యానీ ఆకులో శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్లతో (Proteins) పాటు కార్బోహైడ్రేట్లు (Carbohydrates) పుష్కలంగా ఉంటాయి.  

గాయాలను, నొప్పులను తగ్గిస్తుంది : 

బిర్యానీ ఆకులో యాంటీ సెప్టిక్ (Antiseptic) లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంపై ఏర్పడే గాయాలను, ఇన్ఫెక్షన్ (Infection) లను తగ్గించడానికి చక్కని ఔషధంగా పనిచేస్తాయి. జాయింట్ లో ఏర్పడే నొప్పులను సైతం తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : 

బిర్యానీ ఆకులు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి (Vitamin C) శరీర రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడే జలుబు, దగ్గులను, జ్వరాలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది.

తల నొప్పిని తగ్గిస్తుంది : 

తల నొప్పి (Headache) నుంచి తక్షణ ఉపశమనం కలగడానికి బిర్యాని ఆకు మంచి ఔషధంగా (Medicine) పనిచేస్తుంది. ఒక గిన్నెలో నీటిని పోసి అందులో బిర్యాని ఆకులను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడంతో తలనొప్పి నుండి తక్షణ విముక్తి కలుగుతుంది.

క్యాన్సర్ వృద్ధిని నిరోధిస్తుంది : 

బిర్యాని ఆకులో పాలిక్ యాసిడ్ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ (Cancer) ఏజెంట్లుగా పనిచేస్తాయి. శరీరంలోని క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ (Anti-inflammatory) లక్షణాలు కూడా పుష్కలంగా ఉండి నొప్పి, వాపులను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది : 

బిర్యానీ ఆకులను కాల్చి ఆ వాసనని పీల్చడంతో ఒత్తిడి (Stress)తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆందోళన సమస్యలను కూడా దూరం చేస్తుంది. బిర్యానీ ఆకు పొగ గాలిలోని సూక్ష్మక్రిములను (Germs) సైతం నాశనం చేస్తుంది. బిర్యానీ ఆకు పొగను పీల్చడంతో నిద్రలేమి సమస్యలు తగ్గి గాఢనిద్రలోకి వెళ్తారు.

ఉదర సమస్యలను తగ్గిస్తుంది : 

అల్సర్ (Ulcer) సమస్యలను తగ్గించడానికి బిర్యాని ఆకు చక్కగా పనిచేస్తుంది. కడుపు నొప్పి (Abdominal pain), కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది : 

బిర్యానీ ఆకులు అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణ వ్యవస్థను (Digestive system) మెరుగు పరచి తిన్న ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్దకపు సమస్యలను (Constipation problems) తగ్గిస్తుంది.

Post a Comment

0 Comments