Ads Area

రెండో రోజూ పీఆర్‌సీపై సీఎం జగన్‌ సమీక్ష

0

 రెండో రోజూ పీఆర్‌సీపై సీఎం జగన్‌ సమీక్ష



అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను వారు సీఎంకు  వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం రెండు గంటలపాటు చర్చించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఎంత శాతం ఇవ్వాలి, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలపైనా సీఎం చర్చించారు. ఫిట్‌మెంట్‌, ఇతర డిమాండ్ల అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎంతమేర భారం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించి ఫిట్‌మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపైన కూడా సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలున్నాయి.

పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై ముగిసిన సీఎం జగన్‌ సమీక్ష :

పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్‌కు బుగ్గన వివరించారు. ఫిటిమెంట్‌ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోమారు చర్చించే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area