GET MORE DETAILS

ఒకరిని నమ్మి మనం మోస‌పోకుండా ఉండాలంటే ఆచార్య చాణ‌క్య కొన్ని విధానాల‌ను తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకరిని నమ్మి మనం మోస‌పోకుండా ఉండాలంటే ఆచార్య చాణ‌క్య కొన్ని విధానాల‌ను తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.



బంగారాన్ని రుద్దడం, నిప్పుల్లో వేడి చేయడం ద్వారా అది స‌రైన‌ బంగారమా కాదా అనే విష‌యాన్ని స్వ‌ర్ణ‌కారుడు తెలుసుకుంటాడు. బంగారంలో కల్తీ అనేది జరిగితే, ఈ చర్యల ద్వారా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇదేవిధంగా ఒక వ్యక్తి ఎటువంటివాడు అనేది తెలుసుకునేందుకు అతనిలో ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయోలేదో చూడాలని ఆచార్య చాణ‌క్య సూచించారు.

త్యాగ గుణం :

ఒక వ్యక్తిపై న‌మ్మ‌కం ఏర్ప‌రుచుకునేముందు అతను ఇతరుల సంతోషం కోసం కొంత‌మేర‌కైనా త్యాగం చేస్తాడో లేదో గ‌మ‌నించాలి. ఒక వ్యక్తి తన ఆనందాన్ని ఇతరుల సంతోషం కోసం త్యాగం చేస్తూ ఉంటే అతడు విశ్వసించద‌గిన‌వాడ‌వుతాడ‌ని చాణ‌క్య‌నీతి చెబుతోంది.

మంచి స్వ‌భావం :

మంచి స్వభావాన్ని కలిగిన‌ వ్యక్తులు..ఇతరుల విష‌యంలో త‌ప్పుగా న‌డుచుకోర‌ని భావించి, వారిని నమ్మవచ్చ‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు.

ఈ లక్షణాలను చూడండి :

కోపం, బ‌ద్ద‌కం, స్వార్థం, గర్వం, అబద్ధం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు కలిగివున్న వ్యక్తులను విశ్వసించడం మానుకోవాలి. నిశ్చల స్వభావం క‌లిగిన‌వారు, ఎప్పుడూ సత్యాన్నే ప‌లికేవారు న‌మ్మ‌ద‌గిన‌వార‌ని చాణ‌క్య తెలిపారు.

ఈ ప‌నుల‌ను గ‌మ‌నించండి :

అధర్మంగా పని చేసి డబ్బు సంపాదించే వారిని నమ్మి తప్పు చేయకూడదు. అలాంటి వారు తమ స్వార్థం కోసం ఎవరినైనా మోసం చేసే ల‌క్ష‌ణాన్ని క‌లిగివుంటారు. క్ర‌మశిక్ష‌ణ‌తో, ధ‌ర్మ‌బ‌ద్ధంగా డబ్బు సంపాదించేవారినే నమ్మాలని చాణ‌క్య సూచించారు.

Post a Comment

0 Comments