ఉపాధ్యాయులు, తరగతి గదులపై లెక్కలు తేల్చాలి _ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనంతో ఏర్పడే ఉపా ధ్యాయ ఖాళీలు, తరగతి గదుల అవసరంపై సమగ్రంగా లెక్క తేల్చాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ గురువారం జిల్లా విద్యాధికారులు, సంయుక్త ప్రాంతీయ సంచాలకులు, ఇన్చార్జి డైరెక్ట ర్లతో సమావేశం నిర్వహించారు. సబ్జెక్టు ఉపాధ్యా యులు, తరగతి గదుల నిర్మాణంపై డీఈవోలు సమ ర్పించిన జాబితాలను పరిశీలించిన ఆయన మరోసారి కసరత్తు చేసి సోమవారం నివేదికలు ఇవ్వాలని సూచించారు. 3-10 తరగతుల వరకు ఒకే మాధ్య మంగా పరిగణనలోకి తీసుకొని, సెక్షన్కు 11 మంది ఉపాధ్యాయుల చొప్పున జాబితాను సిద్ధం చేయాలని, తరగతి గదులను పునఃపరిశీలించాలని సూచించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాబార్డు రూ. 100 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంలో గదులు నిర్మించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.. ఇందుకు అనుగుణంగా జాబితాను సిద్ధం చేయను న్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని 3,4,5 తరగతు లను ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేస్తే భారీగా తరగతి గదులు అవసరం కానున్నాయి.
0 Comments