GET MORE DETAILS

'ఫ్యామిలీ డాక్టర్' అమలుకు కసరత్తు

 'ఫ్యామిలీ డాక్టర్' అమలుకు కసరత్తు




 గ్రామ స్థాయిలో 'ఫ్యామిలీ డాక్టర్' విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. గ్రామస్థాయిలో వైద్యసేవల విస్తరణపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే. 

ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.

104 మొబైల్ వైద్య సేవలను పటిష్టం చేసి, నెలలో రెండుసార్లు ప్రతి గ్రామంలో వైద్య సేవలందించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రస్తుతం రాష్ట్రంలో మండలానికి ఒకటి చొప్పున 104 వాహనాలు 656 ఉన్నాయి. ఈ వాహనాలు ఆయా మండలాల పరిధిలోని గ్రామాలన్నింటినీ నెలకు ఒకసారి సందర్శిస్తున్నాయి.

ఇకపై నెలకు రెండుసార్లు 104 వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కొత్తగా 432 వాహనాలను కొనుగోలు చేస్తోంది.

ఇందు కోసం రూ.107.16 కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే వాహనాలతో కలిపి నెలలో రెండుసార్లు ప్రతి పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాలకు రెండుసార్లు వాహనాలు వెళ్లేందుకు వీలుగా అధికారులు రూట్లు గుర్తిస్తున్నారు.

ఏ రోజున ఏ గ్రామానికి వాహనం వెళ్లాలి, ఆ రోజు 104 విధుల్లో పీహెచ్సీలోని ఏ వైద్యుడు ఉండాలి. తదితర వివరాలతో కూడిన టైమ్ బుళ్లను జిల్లాల వారీగా రూపొందిస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించి తుది రూపం ఇస్తారు.

Post a Comment

0 Comments