GET MORE DETAILS

సముద్రాల లోపల అగ్ని పర్వతాలు ఉన్నట్టే జలపాతాలు కూడా ఉన్నాయంటారు నిజమేనా ?

సముద్రాల లోపల అగ్ని పర్వతాలు ఉన్నట్టే జలపాతాలు కూడా ఉన్నాయంటారు నిజమేనా ?



సముద్రాలు చాలా లోతైనవి. ఇందులో ఉన్నవి కేవలం ఉప్పునీరు. సాధారణంగా సముద్రపు నీరు సముద్రంలో పడడం అంటూ ఉండదు. అక్కడక్కడా నదులు, సముద్రాన్ని కలిసేచోట సముద్రపు మట్టం కన్నా నదిలో నుంచి పడే నీరు చాలా ఎత్తు నుంచి పడినట్టయితే ఆ జలధార పడ్డచోటే సముద్రపు నేలలో ఏదైనా నెర్రెలు, ఉన్నట్లయితే ఆ నెర్రెల్లోకి నీరు కిందికి జారినట్లు అనిపిస్తుంది. సముద్రపు జలపాతాలు కావు. మామూలు జలపాతాలే. మారిషస్‌ ద్వీపాల్లో అక్కడక్కడా కొన్ని చోట్ల ఇసుక మేటలతోపాటు సాంద్ర తరమైన కాల్షియం సల్ఫేటు పదార్థపు రేణువులు సముద్రపు నేల ఎగుడుదిగుడుల్లో చారికల్లాగా పేరుకుపోవడం వల్ల సముద్రంలోనే జలపాతం ఉన్నట్లు భ్రమ కల్గుతుంది. నిజానికి సముద్రాల్లో ఎక్కడా జలపాతాలు లేవు.

Post a Comment

0 Comments