GET MORE DETAILS

శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు ? దీని వెనుక కారణమేంటి...?

శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు ? దీని వెనుక కారణమేంటి...?



పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు.. శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు. అలాగే.. విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు. శివ కేశవుల్లో బేధం లేనపుడు.. ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు? ఇంతకీ శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మానవ శరీర నిర్మాణం ప్రకారం.. కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు. ఇది బయటకు కనపడకపోయినా.. దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది. ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు.

ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమం గా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు. ఐతే హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు. ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక గా శివుడు అలా ధరిస్తాడట. అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు. పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే.. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్ గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూది ని ధరిస్తూ ఉంటారు.

అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరు గా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువు గా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు. ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపం గా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు.

Post a Comment

0 Comments