GET MORE DETAILS

TS - మందులు కాదు , మల్టీ విటమిన్లే - ఒమిక్రాన్ బాధితులకు లక్షణాలు లేకపోవడంతో ఇవే ఇస్తున్న వైద్యులు.

TS - మందులు కాదు , మల్టీ విటమిన్లే - ఒమిక్రాన్ బాధితులకు లక్షణాలు లేకపోవడంతో ఇవే ఇస్తున్న వైద్యులు.



రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియెంట్ గుర్తించిన బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడ గానే ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఏ ఒక్కరిలోనూ ఎలాంటి లక్షణాలను వైద్యులు గుర్తించలేదన్నారు. వారికి వేళకు భోజనం అందించడంతో పాటు మల్టీ విటమిన్ టాబ్లెట్లను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 9 ఒమిక్రాన్ కేసులను గుర్తించిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రా నికి వెళ్లిపోగా.. మిగతా బాధితులను గచ్చిబౌ లిలోని టిమ్స్ ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షి స్తున్నారు. బాధితులను ఐసోలేషన్కే పరిమితం చేస్తూ సమృద్ధిగా పోషకాలున్న ఆహారం తీసుకోవా ల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాలు బయటపడితే వాటికి తగ్గట్టు చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వచ్చిన 8 మందితో పాటు మరికొందరు కోవిడ్-19 వచ్చిన వాళ్లు టిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

Post a Comment

0 Comments