ముక్కోటి ఏకాదశి. మన హైందవ ధర్మాను సారం ఈ ముక్కోటి దేవతలు గోవులో వున్నారని కూడా చెబుతుంది.
మరి ఇంతమంది (ఈ 33 మంది అయినా) ఎలా ఆవులో వుండగలరు అని కూడా కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. ఆవు ఆకారం అంతా పెద్దది కాదే అని కూడా అంటుంటారు.
ఈ ముక్కోటి లో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం. మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ , స్థితి అనే వర్గానికి విష్ణువు , లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు.
ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి.
పండగ ఆచరించు విధానం :
ఈరోజు పూర్తిగా ఉపవాసము ఉండాలి , తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు.
ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. *'లంకణం పరమౌషధ'* మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా , వాసం అంటే ఉండటం , దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ , జపం , ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.
ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.
0 Comments