నేడు పల్స్ పోలియో - 52 లక్షల 93 వేల 832 మంది చిన్నారులకు చుక్కల మందు - 37 వేల 969 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలోకరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆదివారంరాష్ట్ర వ్యాప్తం గాఐదేళ్లలోపుచిన్నారులకు పోలియోచుక్కలు వేయను న్నారు. పల్స్ పోలియో కార్యక్రమా నికి అవసరమైన ఏర్పాట్లన్నీ వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల 93 వేల 832 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం వైద్య ఆరోగ్య శాఖ 66.95 లక్షల డోసులను సిద్ధం చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 37 వేల 969 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. అలాగే ఇంటింటికీ పోలియో చుక్కలు వేసేందుకు 75 వేల 938 మంది సిబ్బందిని కేటాయించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 51 వేల 876 మంది వ్యాక్సినేటర్లు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. అలాగే 1374 మొబైల్ పోలియో డ్రాప్స్ టీమ్స్న ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ప్రత్యేక కేంద్రాల ద్వారా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సోమవారం నుంచి మార్చి 6వ తేదీ వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు సోమవారం నుంచి మార్చి 1వ తేదీ వరకు వ్యాక్సినేటర్లు ఇంటింటికీ వెళ్లి వేస్తారు. మార్చి 2వ తేదీ నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి వంటి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేటర్లు పర్యటించి పోలియో చుక్కలు వేయనున్నారు. తొలి రోజే 95 శాతం మంది చిన్నారులకు టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్దేశించారు.
0 Comments