GET MORE DETAILS

స్లీప్‌ ఆప్నియా అంటేఏమిటి ? - వివరాలు

స్లీప్‌ ఆప్నియా అంటేఏమిటి ? - వివరాలు



స్లీప్‌ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన రుగ్మత. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో పలుసార్లు ఇబ్బంది కలగడాన్ని స్లీప్‌ ఆప్నియాగా పరిగణిస్తారు. అధిక రక్తపోటు వంటి సమస్యలకు కారణం అవడంతోపాటు తీవ్రతను అధికం చేస్తుంది. ఒక్కోసారి గుండెపోటుకు కూడా దారితీయవచ్చు. దీనిని మూడు రకాలుగా పేర్కొంటారు. అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా, సెంట్రల్‌ స్లీప్‌ ఆప్నియా, కాంప్లెక్స్‌ స్లీప్‌ ఆప్నియా.

అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా...

నిద్రిస్తున్న సమయంలో ఎగువ శ్వాస ద్వారాలు మూసుకొనిపోవడం వల్ల కలిగే ఇబ్బంది ఇది. ఇది వ్యాధే అయినప్పటికీ ఒక్కోసారి మనం గుర్తించలేం కూడా. గొంతులోని సున్నితమైన కండరాలు శ్వాసమార్గాన్ని అడ్డుకున్నప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. తద్వారా నిద్ర మధ్యలోనే శ్వాస హఠాత్తుగా ఆగిపోవడంతో ఆకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఈవ్యాధి ఉన్నవారు నిద్రిస్తున్న సమయంలో పలుసార్లు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ఇలా శ్వాస సరిగా అందకపోవడంతో శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. గుండె ఆగిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతాయి.

లక్షణాలు...

పగటి సమయంలో అతిగా నిద్రమత్తు.

గట్టిగా గురక పెట్టడం.

నిద్రిస్తున్న సమయంలో పలుసార్లు శ్వాస ఆగిపోవడం.

శ్వాస ఆగిపోయి హఠాత్తుగా మెలకువ రావడం.

మెలకువ సమయంలో గొంతు లేదా నోరు మొత్తం పొడిగా మారడం.

ఉదయాన్నే తీవ్ర తలనొప్పి.

పగటి సమయంలో ఏకాగ్రత లేకపోవడం.

కుంగిపోవడం లేదా చిరాకు వంటి మానసిక సమస్యలు.

అధిక రక్తపోటు వంటి లక్షణాలు అబ్‌స్ట్రక్టీవ్‌ స్లీప్‌ ఆప్నియా రుగ్మత ఉన్నవారిలో కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్య పరీక్షలతో ఈ వ్యాధిని ముందుగానే నిర్ధారించుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుంది.

Post a Comment

0 Comments