GET MORE DETAILS

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అంటే ఏమిటి ?

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అంటే ఏమిటి ?




✅ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి.

✅ ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, మిగతా సభ్య దేశాలు సహాయం అందించాలన్నది నాటో ఒప్పందం.

✅ రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా నాటో ఏర్పడింది.

✅ నాటో ఏర్పాటుకు ప్రతిస్పందనగా, సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో కలిసి సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. దీన్ని వార్సా ఒప్పందం అంటారు.

✅ 1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత, చాలా దేశాలు వార్సా ఒప్పందం నుంచి బయటికొచ్చి నాటో కూటమిలో చేరాయి. ప్రస్తుతం నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి.

❓ యుక్రెయిన్‌లో నాటో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ? 

యుక్రెయిన్ నాటోలో భాగం కాదు. అందుచేత, దానికి కచ్చితంగా సహాయం చేయాలనే నిబంధన లేదు.

◾ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన యుక్రెయిన్ అనేక సంవత్సరాలుగా నాటోలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి యుక్రెయిన్‌ రష్యాలో భాగమని పుతిన్ ఇటీవల పేర్కొన్నారు.

◾యుక్రెయిన్ నాటోలో చేరేందుకు ఎప్పటికీ అనుమతించకూడదన్నది రష్యా వాదన. అయితే, నాటో కూటమి దీనికి సమ్మతించలేదు. దాడికి ముందు రష్యాకు ఉన్న కోపాల్లో ఇదీ ఒకటి.

◾ఇప్పుడు నాటో దళాలు యుక్రెయిన్ విషయంలో జోక్యం చేసుకుంటే సమస్య మరింత జటిలం కావొచ్చు. ఒకవేళ అదే జరిగితే, అణ్వాయుధాల వరకు వెళ్లాల్సి వస్తుందని పుతిన్ పరోక్షంగా హెచ్చరించారు.

◾"రష్యా వెంటనే స్పందిస్తుంది. ఫలితంగా, మీ చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలను చూస్తారు" అంటూ పుతిన్ బెదిరించారు.

◾యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ దాన్నొక "క్రూరమైన యుద్ధ చర్య"గా పేర్కొన్నారు.

◾తూర్పు యూరప్ సభ్య దేశాలు ఆందోళన వ్యక్తపరచడంతో, నాటో ఇప్పటికే వందలాది యుద్ధ విమానాలను, నౌకలను అప్రమత్తం చేసింది. ఆ ప్రాంతంలో సైనికుల సంఖ్యను పెంచనుంది.

◾యుక్రెయిన్‌కు మరిన్ని సైనిక దళాలను పంపించేందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉంది. అయితే, ఈ దళాలు అక్కడ ఉన్న నాటో భూభాగాన్ని రక్షించడానికి మాత్రమేనని, యుక్రెయిన్‌లో యుద్ధం కోసం కాదని బైడెన్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments