GET MORE DETAILS

చికిత్సలేని సెరిబ్రల్ పాల్సీ

చికిత్సలేని సెరిబ్రల్ పాల్సీప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు సంభవించే చికిత్సలేని వ్యాధి సెరిబ్రల్ పాల్సీ.సెరిబ్రల్ పాల్సీ కేసులు భారతదేశంలో కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి 1000 మంది పిల్లలలో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.హెల్త్‌లైన్ తెలిపిన వివరాల ప్రకారం మెదడు పూర్తిగా అభివృద్ధి చెందనప్పుడు, శరీరంలో అనేక రుగ్మతలు తలెత్తుతాయి. దీనినే సెరిబ్రల్ పాల్సీ అంటారు. ఇది నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి పిల్లల పుట్టుకకు ముందు అంటే తల్లి గర్భంలో అభివృద్ధి చెందుతుంది.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 85 శాతం సెరిబ్రల్ పాల్సీ కేసులు ఇది పుట్టుకతోనే వస్తాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు గర్భధారణ సమయంలో శిశువు మెదడులో ఆక్సిజన్ లేకపోవడం, జన్యువుల మ్యుటేషన్, మెదడులో ఇన్ఫెక్షన్ లేదా మెదడు నుండి రక్తస్రావం కావడం ఇవన్నీ కారణాలుగా నిలుస్తాయి. సెరిబ్రల్ పాల్సీ యొక్క లక్షణాలు పిల్లలలో రెండేళ్ల వయసులో కనిపిస్తాయి.

కండరాలు బిగుసుకుపోవడం, నడవడంలో ఇబ్బందులు, ఆహారం మింగడంలో ఇబ్బందులు, కళ్ల కండరాల్లో అసమతుల్యత ఏర్పడటం, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. అత్యంత సాధారణంగా నడకలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీనిని ఇది అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా గుర్తిస్తారు. పరిస్థితిని బట్టి వ్యాధి ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments