Sri Lanka : డీజిల్ పై ఒకేసారి రూ.75 పెంపు.. లీటరు పెట్రోల్ రూ.254
ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎలస్ఐఓసీ) ఇంధన ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. లీటర్ డీజిల్పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎస్ఐఓసీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా లీటరు పెట్రోల్ ధర రూ.25గా.. డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఎల్. ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
0 Comments