"ఆంధ్రా అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ"
వ్యాసం రచయిత : ఐ.ప్రసాదరావు
◆ 1841లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నందు భవనీశంకరం, నరసయమ్మ దంపతులకు జన్మించిన సీతమ్మ, చిన్నతనంలోనే దాన గుణానికి అలవాటు పడి, చివరికి తాను బ్రతికినన్నాళ్ళు ఆ నాణ్యత నిలబెట్టుకొన్న నారీమణి డొక్కా సీతమ్మ. అమ్మతత్వం, దాత్రుత్వం, మానవతం, త్యాగం, దయాగుణానినికి మారు పేరుగా నిలిచిన ఒకే ఒక మహిళామణి సీతమ్మ. చిన్నప్పుడు నుంచి దానధర్మాలు చేయడం ఉన్న సీతమ్మ , జోగన్నతో వివాహం జరిగి, అత్తారింటికి వెళ్ళినా ఆ గుణం దినదినాభివృద్ధి చెందింది. వారి ఇంటి వద్ద, పొలంలో పనిచేసిన పాలేర్లకు తన సొంత మనుషులుగా చూసింది. కులం, మతం వంటి తారతమ్యాలు లేకుండా ఆరోజుల్లోనే అందరికీ సహాయం అందించిన ఆదర్శమూర్తి.
◆ పిఠాపురం మహారాజా మహీపతి గంగాధర రామారావు బహుదూర్ వంటి వారు కూడా ఈమే చేతివంట రుచి చూసిన వారే. దొంగ హ్రుదయాన్ని మార్చిన మహామనిషి. చంటి పిల్లలకు పాలు, ఆకలితో ఉన్న వారికి ఎల్లప్పుడూ మజ్జిగ, ఆహారం అందించి ఆరోజుల్లో బాటసారులకు కడుపునింపిన సీతమ్మ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా , తదుపరి ఇంగ్లాండ్ దేశం వరుకూ పేరు ప్రఖ్యాతులు పొందిన త్యాగశీలి. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ, గర్భిణీ స్త్రీలకు పురుడు పోసి, క్షేమంగా వారి వారి ఇండ్లకు పంపిన మాత్రృమూర్తి. ఆస్తులు, బంగారం అన్ని అన్నదానానికి ఖర్చు పెట్టారు. దళిత ప్రజలను అక్కున చేర్చుకున్న గొప్ప స్త్రీమూర్తి. ఆరోజుల్లో "మసూచి" సంభవించిన సమయంలో అనేక సేవలు అందించుట జరిగింది. అనేక దేవాలయాలు నిర్మించారు. ధ్వజస్తంభాలు ఏర్పాటు చేశారు.
◆ ఆనాటి బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ 7 ఈమె సేవలు తెలిసుకొని అనేక మార్లు ఇంగ్లాండ్, ఢీల్లి రావాలని కోరినారు. ఈమే సేవలను తెలిసికొని ముగ్ధుడైనారు. ఈమె చిత్రపటం ఈరోజు కూడా లండన్ రాజు ప్యాలెస్ నందు ఉండట గర్వకారణం. ఈవిధంగా నిరంతరం అన్నదానం, ఇతర సేవలు అందించిన డొక్కా సీతమ్మ సదా చిరస్మరణీయరాలు... కష్టకాలంలో మనం కూడా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించుటయే వీరికి మనం ఇచ్చే ఘన నివాళి...
0 Comments