GET MORE DETAILS

రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేకత

రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేకత




పరమేశ్వరుడి అంశంగా అవతారమెత్తిన ఈ పవన సుతుడు శ్రీ రాముడికి ప్రియ భక్తుడు. ఎర్రని కనులను కలిగిన వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బంధీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించాడు. ఔషధీ సమేతంగా సంజీవర పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించినవారికి మృత్యుభయం ఉండదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.

ఇంతటి పరాక్రమధీరుడయిన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు, మరికొందరు వైశాఖ దశమినాడు జరుపుకుంటారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఈ సారి చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 27 మంగళవారం.చైత్ర పౌర్ణమి నాడు వచ్చే హనుమాన్ జయంతి ఉత్తర భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు.

ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముడిని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసి ఎందుకు పెట్టుకున్నవు తల్లీ? అని అడిగితే, శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి.

Post a Comment

0 Comments