GET MORE DETAILS

అసలు చెమటలు ఎందుకు పడతాయి?

 అసలు చెమటలు ఎందుకు పడతాయి? 



అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా ఈ అధిక చెమటకు కారణమవుతాయి.

మరి వీటి నుంచి విముక్తి లేదా... అంటే ఉంది.. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు.

వెనిగర్ లో ఉండే రక్తస్రావాన్ని ఆపే గుణం వల్ల చెమటలు అధికంగా పట్టడాన్ని అదుపులో పెట్టవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఓ టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పడిగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

నిమ్మరసం సహజసిద్ధమైన డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఇది అధికచెమటనూ తగ్గిస్తుంది. నిమ్మకాయరసాన్ని మీ అండర్ ఆర్మ్స్ లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయండి.

కొబ్బరినూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరినూనెను అరిచేతితో వేసుకుని చంకలు, మోకాళ్ల వెనుక.. చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. 

అలోవెరా జెల్ లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్ ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి  వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి చంకల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీలో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో చంకల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీలో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో చంకల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

Post a Comment

0 Comments