GET MORE DETAILS

ఆలయాలు - అద్భుతాలు.

ఆలయాలు - అద్భుతాలు.



మనకు తెలియని విషయాలు ఎన్నో వుంటాయి అందులో మనం చూసిన, చూడని మన ఆలయాలు ఎన్నో. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్లు. ఒకొక్క ఆలయానికి ఒక్కో ప్రత్యేకత వుంటుంది. 

పూర్వకాలంలో దేవాలయాలు (ఆలయాలు/కోవెలలు/గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు. అయితే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది. ఉదాహరణకు కొన్ని చూద్దాం.

1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే బయటకు మాడ వీధులకు వచ్చేది.. చిదంబరం నటరాజస్వామి.

2. కుంబకోణంలో ఐరావతేశ్వర స్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్ప కళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలి సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది. కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడివుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంబము నుంచి చూస్తె శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగా తెలుస్తుంది.

3. ధర్మపురి (తమిళనాడు) లో మల్లికార్జున స్వామీ కోవెల లోన వంగామంటపం అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడు తున్నట్టుగా ఉంటాయి.

4. కరూర్ (కోయంబత్తూర్) సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో కదంబ వననాధ స్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.

5. గరుడుడు నాలుగు కరములతో (చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.

6. కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణువు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు వుంటుంది. కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను 8,16,32 అలా బయట వీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది 

మరి స్వామీ గుడిలోనికి పోతున్నప్పుడు అదే విధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమటపట్టడం కూడా ఒక అంతు చిక్కని విచిత్రమే.

7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూల స్థానంలో విగ్రహం రాతిది కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం కుంకుమ పువ్వు పచ్చ కర్పూరం మూలికలతో చేసినది. ఆశ్చర్యం కదా..

8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి దేవాలయంలో ఒక బిల్వ చెట్టు స్థల వృక్షంగా వుంది. ఆ చెట్టులో కాచే బిల్వ కాయలు లింగాకారంలో వుంటాయి.

9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచ వర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.

10. విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్) నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.

11. ఆంధ్రప్రదేశ్, సామర్లకోటలో మూడు వీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామ సన్నిధిలో శ్రీరాముని పాదములు చూసేలాగ ఒకే ఎత్తులో వుండడం.

12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది. పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం. గడియారం చూడనవసరము లేదు.

13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేద నారాయణ స్వామి కోవెలలో మూల విగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారం నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది.

14. ధర్మపురి(తమిళనాడు) పక్కన పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.

ఇలా మనకు తెలియని, తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ విధానంగా కట్టిన మన హిందూ దేవాలయాలు ఎన్నెన్నో వున్నాయి.

ఓం నమః శివాయ

Post a Comment

0 Comments