ఏకాదశినాడు పాటించవలసిన నియమములు
ఏకాదశినాడు ఉపవాస వ్రతము పాటించు వ్యక్తికి సమస్త పాపములు నశించి పవిత్ర జీవనము సిద్ధించునని బ్రహ్మవైవర్త పురాణం లో గలదు.
ఏకాదశినాడు ఉపవాసము చేయుటలో గల అంతరార్థము మన శరీరపు అవసరములను తగ్గించుకొనుట, నామజపము చేయుట, భగవత్ సేవలో కాలము గడుపుట. ఉపవాసముండు దినములలో ముఖ్యముగా గోవిందుని లీలలు స్మరించుట, నిరంతరం ఆయన నామశ్రవణము చేయుట ఉత్తమము !
ఎవరైనా తెలిసి లేదా తెలియకుండానే ధాన్యాన్ని ఏకాదశి రోజున తింటే, అతను పాపాన్ని భుజించినట్లే.
తినవలసినవి :
సామలు, వేరుశనగలు, పాలు, పాల పదార్థాలు, మిరియాలు, జీలకర్ర, సగ్గుబియ్యం, బెల్లం ,యాలుకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, వేరుశెనగ నూనె, బంగాళదుపంపలు, చిలకడ దుంపలు, బీట్ రూట్, క్యారెట్, అల్లం, మిర్చి, అరటికాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటో,క్యాబేజి, క్యాలీఫ్లవర్ రాజగిరి ఆట(రాగి పిండి కాదు ), సైందవ లవణమ్(రాక్ సాల్ట్ ), నిమ్మకాయలు, పన్నీర్, పూల్ మఖాన్, డేట్స్, బెల్లం, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు.
తినకూడనివి :
ధాన్యాలు (గోధుమ, బియ్యం, మొదలైనవి), బఠానీలు, బీన్స్, చిక్కుడు, బీరకాయ, పొట్లకాయ, వంకాయ, బెండకాయ, కాకరకాయ, ఉల్లి, వెల్లుల్లి, ములకాయ, ఆవాలు, మెంతులు నువ్వులు, ఈ ఆహారాల ఉత్పన్నాలు (గోధుమ పిండి, ఆవ నూనె, సోయా బీన్ ఆయిల్ మొదలైనవి), మినప్పప్పు,వేపినశనగ పప్పు, కందిపప్పు, పచ్చిసనగ పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయ్ రవ్వ, గోధుమ రవ్వ, కారం, పసుపు, సాల్ట్, గ్రుడ్డు, మాంసం, చేపలు, ఇతర నాన్వెజ్ పదార్దాలు, ఆకు కూరలు, మైదా, ఇతర రవ్వ పదార్దాలు, పిండి పదార్దాలు, తేనే, టీ, కాఫీ, అరికలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు.
0 Comments