GET MORE DETAILS

ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ ౼ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

 అమరావతి...

ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ ౼ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం



★ దేవాదాయ భూముల ఆక్రమణలు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

★ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.

★ ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్లు ను పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కూడా కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం.

★ ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

★ బైజూస్ కోసం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం.

★ 35 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.

★ వివిధ సంస్థలకు 112 ఎకరాలు  కేటాయింపుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

★ అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు  ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

★ పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ 50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

★ కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో 150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రయివేట్‌లిమిటెడ్‌  పెట్టనున్న రొయ్యల ప్రాససింగ్‌ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.

★ కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు  ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.

★ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై క్యాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం.

★ కోనసీమ జిల్లాకు అంభేద్కర్ జిల్లాగా మార్చే నోటిఫికేషన్ గడుపుపూర్తయి నందున దానిపై నిర్ణయం తసుకునే అవకాశం

★ ఈ నిర్ణయం తో స్ధానికంగా ఎదురయ్యే ఇబ్బందులుపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం.

Post a Comment

0 Comments