కాకి కాలజ్ఞాని అంటారు ఎందుకో...
వేకువ జామునే(బ్రహ్మ ముహూర్తంలో) మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.. కావు కావు నీ భంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అంటూ అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి.. ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసులుతున్నదే కాకి.. శత్రువులను గుర్తించి వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు.
ఆడ కాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం ఓ గొప్ప విషయం... ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.... సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే; అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...!! కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వఠవృక్షాలుగా పెరుగుతాయి అలా పచ్చని పకృతి విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే కాకులు దూరని కారడవి అంటారు.... కాకులు అరుస్తోంటే ఎవరో కావలసిన భంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తూంది అనేవారు పెద్దలు .... అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు(భూమి కంపించేముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికిచేరి గ్రహణం విడిచాక కాకులు స్నానమాచరించి బయట ఎగుతాయి అందుకే కాకి కాలజ్ఞాని అంటారు....!!!
దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు... భోజనం చేసేముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు; మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఈ పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తూంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు .....!!! కాకి కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చిన తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకికి....!!
సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!
భారతీయుల సనాతన ధర్మం విశిష్టత ఆవశ్యకత నేటి జనం మనం ఆచరించాల్సినవే ఇవన్నీ సంఘజీవనం సేవాతత్పరత మంచి స్నేహభావాలతో ఈర్ష్య ద్వేషాలు లేకుండా కలసి మెలసి అన్యోన్యంగా అసమాతలకతీమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము.....!!
0 Comments