GET MORE DETAILS

డైనోసార్లు ఉన్న సంగతి నిజమేనా...?

డైనోసార్లు ఉన్న సంగతి నిజమేనా...?



డైనోసార్లు నిజంగా ఉన్నాయా? అవి లేకపోతే మళ్లీ మన మధ్య ఉన్నట్టు సినిమాల్లో చూపిస్తున్నారెందుకు?

దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం వరకు డైనోసార్లు ఈ భూమ్మీద ఉండేవన్నది పచ్చినిజం. వివిధ ప్రజాతులకు చెందిన డైనోసార్ల శిలాజ (fossil)అవశేషాలు వాటి ఉనికికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ దశలో భూమ్మీద అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలు కూడా కలిసే ఉండేవి. కానీ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాటి దేహ నిర్మాణంలోని అసౌకర్యం వల్ల, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఇవి క్రమేపీ అంతరించాయి. ఓ సిద్ధాంతం ప్రకారం ఓ పెద్ద గ్రహశకలం భూమిపై పడిన ఆతాకిడి కలిగించిన తీవ్రమైన పరిస్థితుల వల్ల ఒక్కమారుగా డైనోసార్లు అంతరించాయని, కేవలం చిన్న జీవులే బతికాయని చెబుతారు. అయితే డైనోసార్లు ఇప్పుడు లేవు. జురాసిక్‌ పార్క్‌ లాంటి సినిమాల్లోను, కొన్ని ఛానెల్స్‌లోను చూపించే డైనోసార్లు కేవలం కల్పితం. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ద్వారా యానిమేషన్‌ చేసి అవి మన మధ్యే తిరుగుతున్నట్టు చూపిస్తారంతే.

Post a Comment

0 Comments