GET MORE DETAILS

జీలకర్ర నీటిలో నానబెట్టి తాగుతున్నారా...! సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోతాదు మించితే సమస్యలు...!

జీలకర్ర నీటిలో నానబెట్టి తాగుతున్నారా...! సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోతాదు మించితే సమస్యలు...!



సాధారణంగా ప్రతి వంటగదిలోనూ దర్శనమిచ్చే సుగంధ ద్రవ్యం జీలకర్ర. ప్రపంచవ్యాప్తంగా ఇది వినియోగంలో ఉంది. ఇందులో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అనే రెండు రకాలు ఉంటాయి. అయితే విశేషం ఏమిటంటే... రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకే తీరుగా ఉంటాయి. రోజూవారీ జీవితంలో తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను వినియోగిస్తాం. నిజానికి ఇది కేవలం సువాసనకే పరిమితం కాదు... అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుస్తుంది.

జీలకర్రలో ఉండే పోషకాలు :

►జీలకర్రలో విటమిన్లు ఉంటాయి.

►ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వంటి పోషకాలు పుష్కలం.

►జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. 

►క్యాన్సర్‌ కారక నిరోధకాలు జీలకర్రలో ఉంటాయి.

జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య లాభాలు :

►జీలకర్రను అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా ఉపయోగపడుతుంది.

►చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.

►సాధారణ జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు జీలకర్ర మంచి విరుగుడుగా పనిచేస్తుంది. 

►గర్భాశయ, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును నివారిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.

►చెడు బాక్టీరియాతో పోరాడే గుణం జీలకర్రకు ఉంటుంది. 

►రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.

►బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.

►జీలకర్రలో యాంటీ ఇన్‌ఫ్లామేటరి గుణాలు ఉంటాయి. మంటను తగ్గిస్తుంది.

►జీలకర్రను నీటిలో వేసి రాత్రిపూట నానబెట్టి... మరుసటి రోజు ఆ నీరు మరిగించి, కాస్త తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

►నాడీ వ్యవస్థ ప్రభావంతంగా పనిచేయడంలో జీలకర్ర తన వంతు పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. 

►పార్కిన్‌సన్‌ వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది.

సైడ్‌ ఎఫెక్ట్స్ :

నిజానికి జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే నాన్‌ టాక్సిక్‌(విషపూరితం కానిది) కూడా. అయితే, రోజుకు 300 నుంచి 600 మిల్లి గ్రాములు మాత్రమే తీసుకోవాలని పరిశోధకులు అంటున్నారు. మోతాదు మించితే టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గుతుందని, ఫలితంగా పురుషుల్లో సంతాన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Post a Comment

0 Comments