GET MORE DETAILS

అగ్నిపథ్ – అగ్నివీర్ : : జై జవా న్ & జై హింద్.

అగ్నిపథ్ – అగ్నివీర్ : : జై జవా న్ & జై హింద్.



కేంద్ర రక్షణ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ అనే సైనిక నియామక పధకం మీద అనవసరమయిన ఆందోళన చెలరేగుతున్నది. నిజానికి ఇప్పటి వరకు జరిగిన ఇంకా జరుగుతున్న అల్లర్లు లేదా ఆందోళన కావొచ్చు ఒక పధకం ప్రకారం రాజకీయ ప్రేరణతో చేయిస్తున్నవే!

నకిలీ గాంధీల ED విచారణ ఎదుర్కోవడం మీద ఒక దాని వెనుక ఇంకొకటి విధ్వంసాలకి పాల్పడుతున్నారు. రాజకీయ ప్రేరేపితం కాకపోతే నిరసన చేసేవాళ్ళు కలక్టరేట్ ల ముందు ఆందోళనలకి దిగేవారు కానీ ఇలా ట్రాఫిక్ ని అడ్డుకోవడం,రైళ్లని తగులపెట్టడం లాంటివి చేయరు. గురుగ్రామ్,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ తో పాటు తెలంగాణ లో జరగడం వెనుక స్పష్టమయిన రాజకీయ ఎజెండా ఉంది.   

మొన్న,నిన్న రాజస్థాన్,హరియాన,ఉత్తరప్రదేశ్,బీహార్ లలో జరిగాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ లో జరిగింది అని భావించవచ్చా ? లేదు. ఈ రోజు గాల్వాన్ లోయలో చైనా సైనికులు మరణించిన రోజు. రెండేళ్ల తరువాత మొదటిసారిగా చైనా గాల్వాన్ లోయలో మరణించిన సైనికులులకి శ్రద్ధాంజలి ఘటించింది –మనదేశంలో కమ్మీ స్టూడెంట్ యూనియన్ SF. ఖాంగ్రేస్ స్టూడెంట్ యూనియన్ NSU లు కలిసి విధ్వంసం సృష్టించాయి. స్థానికంగా ఉండేవాళ్ళని ఉపయోగిస్తే తెలిసిపోతుంది అని వరంగల్,నిజామాబాద్,ఆదిలాబాద్ నుండి యువకులని మరి కొంతమంది గూండాలని తరలించాయి  కాంగ్రెస్,కమ్మీ పార్టీలు. TS వీళ్ళకి సహకరించింది. వందలాది కర్రలు,పెట్రోల్ నింపిన సీసాలు అప్పటికప్పుడు వీళ్ళ చేతిలోకి ఎలా వచ్చాయి ? నిన్న రాత్రి అన్నీ సిద్ధం చేసుకొని ఈ రోజు ఉదయాన్నే విధ్వంసం సృష్టించారు. పక్కా ప్లాన్ – ముందు సికందరాబాద్ స్టేషన్ బయట,లోపల ఉన్న CC కెమెరాలని ధ్వంసం చేసి ఆపై యధేచ్చగా దమనకాండ సాగించారు. రాజకీయ అండ లేకుండా ఇదంతా జరగదు ముమ్మాటికీ ! అన్ని పక్షాలు ఏకం అయ్యి ప్రీ ప్లాన్డ్ గా అమలుచేశారు. 

కాస్తో కూస్తో ఉన్న తమ వోట్ బాంక్ అగ్నిపథ్ వల్ల కొట్టుకుపోతుంది అనే దుగ్ధ ఖాంగ్రేస్ ది !

టార్గెట్ 2024 ఎన్నికలు ! ఇప్పుడు మొదలు పెడితే వచ్చే రెండేళ్లలో యువతలో మార్పు వస్తుంది అనే ఆందోళన ఖాంగ్రేస్ ది. 

నిర్బంధ సైనిక శిక్షణ ఇజ్రాయెల్,సింగపూర్ చైనా దేశాలలో ఉంది. అయితే భారత ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అగ్ని పథ్ అనేది స్వచ్ఛంద సైనిక శిక్షణ. ఇష్టం ఉన్నవాళ్ళు చేరవచ్చు ! అంతే కానీ నిర్భంధం కానే కాదు.

1. 17 సంవత్సరాల 6 నెలల వయసు పూర్తయిన వారు అగ్నిపథ్ శిక్షణ కి అర్హులు. శారీరక ధృఢత్వం,ఇతర అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసి వారిని ఆర్మీ,నావీ,ఎయిర్ ఫోర్స్ లలో శిక్షణ ఇస్తారు. 

2. 4 ఏళ్లు సర్వీస్ ఉంటుంది. ఈ నాలుగేళ్లలో అర్హతలని బట్టి నెలకి 30,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు. నాలుగేళ్ళు శిక్షణ లేదా సర్వీస్ పూర్తవగానే సర్వీస్ నుండి రిలీవ్ చేస్తారు. రిలీవ్ చేసే రోజు 11 లక్షల 70 వేలు పన్ను లేకుండా ఇస్తారు. అంటే 18 వయసులో చేరితే 22 ఏళ్ళకి రిలీవ్ అయితే నాలుగేళ్ల కాలంలో నెలకి కనీసం 30 వేల జీతం అనుకున్నా 14,44,000 వస్తుంది అదనంగా రిలీవ్ అయ్యే సమయానికి 11,70,000 చేతికి వస్తుంది అంటే మొత్తం 4 ఏళ్ల లో 26 లక్షల 10 వేలు సంపాదించగలుగుతాడు. 

3. 18 ఏళ్ల వయసు నుండి 22 ఏళ్ల వయసు మధ్యలో ఏం చేసి 26 లక్షల 10 వేలు సంపాదించగలుతారు ?

4. ఈ నాలుగేళ్ల సర్వీసులో ఎవరయితే అత్యుత్తుమ ప్రతిభని కనపరుస్తారో వాళ్ళని రెగ్యులర్ చేస్తారు, సైన్యం ఉన్నది ప్రతిభ కలిగిన వారికే కదా ?

5. 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఏదో ఒక పనిలో చేరుదాము అనుకునే యువకులకి ఇది అత్యుత్తమ అవకాశం. అలా అని అందరూ డిగ్రీలు పాస్ అవుతున్నారా ? లేదే ! ప్రతీ సంవత్సరం 10 వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియెట్ మధ్యలో ఆపేయడం చేస్తున్న వారి సంఖ్య 10 లక్షలకి పైమాటే ! అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం. 18 ఏళ్ల కి ఇంటర్ లేదా +2 పూర్తి చేసి ఉద్యోగలకోసం ప్రయత్నించేవారి సంఖ్య హీన పక్షం 20 లక్షలు ఉంటుంది. వాళ్ళకీ ఇది మంచి అవకాశం. 

6. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల కోసం అందులోనూ క్లాస్ 4 ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాళ్ళలో ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళ వయసు ఎంత లేదన్నా 27 ఏళ్లు ఉంటుంది అలాంటప్పుడు అగ్నిపథ్ ఒక సువర్ణ అవకాశం !

7. అగ్నిపథ్ కింద రిక్రూట్ అయినవాళ్ళని అగ్నివీర్ అని పిలుస్తారు. నాలుగేళ్ల సర్వీసులో కనుక యుద్ధం వచ్చి మరణిస్తే ఇన్స్యూరెన్స్ కూడా చెల్లిస్తారు. ఎలాంటి పన్నులు కట్టక్కరలేదు. 

8. ఒక్క సారికి 40 వేల మందిని రిక్రూట్ చేసుకుంటారు. వీళ్లలో 25 వేల మందిని రెగ్యులర్ చేస్తారు అంటే వీళ్ళు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళు అన్నమాట. మిగతా 15 వేల మందిని రిలీవ్ చేస్తారు. ఇలా సంవత్సరానికి రెండు సార్లు రిక్రూట్ మెంట్ ఉంటుంది అంటే 80 వేల మందిని రిక్రూట్ చేసుకుంటారు. ఇది ప్రతీ సంవత్సరం కొనసాగుతూ ఉంటుంది. అంటే ప్రతీ సంవత్సరం 50 వేల మందిని రెగ్యులర్ చేస్తారు. 

9. 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకొని రెగ్యులర్ కాని వాళ్ళకి CRPF, పారా మిలటరీ లలో చేరడానికి ప్రాధాన్యతని ఇస్తారు. అంటే వీళ్ళు ఇదివరకే శిక్షణ పూర్తి చేసుకొని ఉంటారు కనుక ఈ రెండు విభాగాలలో చేరడానికి ఎలాంటి పరీక్ష లేకుండానే అనుమతి ఇస్తారు కానీ ఫిట్నెస్ విషయంలో మళ్ళీ పరీక్ష ఉంటుంది. 

10. దొంగలు ఆరోపిస్తున్నట్లు రక్షణ శాఖ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అన్న నెపంతో నాలుగేళ్ళు మాత్రమే సర్వీస్ ఇస్తున్నది అన్నది అబద్ధం. 40 వేల మందిలో 25 వేల మంది రెగ్యులర్ అయిపోతారు. అంటే సంవత్సరానికి 50 వేల మంది రెగ్యులర్ అవుతూనే ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రాసెస్ !

ఇంకొంతమంది దొంగలు చెప్తున్నట్లు ఇది మేము చెప్పడం వలన కేంద్రం అగ్నిపథ్ కి రూపకల్పన చేసింది అనేది అవాస్తవం. అసలు విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ తరహా సైనిక రిక్రూట్మెంట్ ఉండాలి అనేది 2015 లో తీసుకున్న నిర్ణయమే అగ్నిపథ్ కి స్ఫూర్తి ! అప్పటి నుండి దీని విధి విధానాలని రూపొందించడం లో నిమగ్నం అయ్యారు మాజీ సైనిక జెనెరల్స్ మరియు ఆర్ధిక వేత్తలు. అగ్నిపథ్ ని ఖచ్చితంగా అమలు చేయాలి అని పట్టుపడుతూ వచ్చారు దివంగత CDS  బిపిన్ రావత్ గారు. అయితే కొంతమంది మాజీ జెనెరల్స్ అగ్నిపథ్ ని అమలు చేయడం మీద విభేదించారు కూడా. అన్నీ పరిగణలోకి తీసుకొనే ఆలస్యం అయినా ఇప్పుడు ప్రకటించారు. ప్రతీ కొత్త విధానాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఒక్కో దాన్ని సవరించుకుంటూ పూర్తి స్థాయిలో అగ్నిపథ్ ని విజయవంతంగా అమలు చేయాలంటే కనీస 5 ఏళ్లు పడుతుంది. 

డిజిటల్ పేమెంట్స్ విషయంలో మొదట్లో ఇలానే అవహేళన చేసిన చెత్త అంబరం ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే డిజిటల్ రియల్ టైమ్ పేమెంట్స్ లో భారత్ మొదటి స్థానంలో ఉంది అని గుర్తుంచుకోవాలి. 

నిజానికి ప్రపంచం లోని చాలా దేశాల మిలటరీ ని ఆధునీకరిస్తున్నాయి. చాలా వరకు ప్రాణ నష్టం నివారణ కోసం సైన్యాన్ని ఆటోమేషన్ దశలోకి తీసుకెళ్తున్నాయి. రాబోయే పది సంవత్సరాలలో అమెరికా తన సైన్యం లో పనిచేసే వారిలో సగానికి సగం మందిని తగ్గించుకోవాలని చూస్తున్నది. వీలున్నంత వరకు AI సహాయం తో పనిచేసే ఆయుధాలని ప్రవేశపెట్టాలనే ప్రణాళిక సిద్ధంగా ఉంది. అమెరికా బాటలో చైనాకూడా ఉంది. అందుకే క్రమంగా సైనిక రిక్రూట్మెంట్ ని తగ్గించుకుంటూ వెళుతున్నాయి. వచ్చే పదేళ్ళలో యుద్ధ టాంకులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అన్నీ అతి కొద్ది మంది తో పనిచేసే విధంగా టెక్నాలజీ మారబోతున్నది. 

రెండు రోజుల క్రితం చైనా ప్రయోగాత్మకంగా ఒక ఫ్రిగేట్ ని జల ప్రవేశం చేయించింది. అందులో పనిచేసేది కేవలం 10 మంది మాత్రమే. అదే రెగ్యులర్ గా ఇప్పటికే సర్వీస్ లో ఉన్న ఫ్రిగేట్ లో పనిచేస్తున్న వారి సంఖ్య 300 నుండి 500 వందల మంది దాకా ఉన్నారు. చైనా ప్రవేశ పెట్టిన యుద్ధ నౌక రిమోట్ గా శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది అంటే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండే కమాండ్ సెంటర్ నుండి శాటిలైట్ ద్వారా ఆదేశాలు తీసుకొని ఫ్రిగేట్ పనిచేస్తుంది. తానే స్వంతంగా మిసైళ్లు,టార్పేడో లని లోడ్ చేసుకుంటుంది టార్గెట్ ని తానే నిర్ణయించుకుంటుంది లేదా కమాండ్ సెంటర్ నుండి వచ్చే ఆదేశాలని తీసుకొని టార్గెట్ ని కొడుతుంది. కేవలం ఇంధనం నింపడం కోసం 10 మంది సిబ్బంది ఆ నౌకలో ఉంటారు తప్పితే మిగతాది అంతా ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతుంది. అంటే ఆ యుద్ధ నౌకలో సిబ్బంది దాదాపుగా 400 వందలమంది కి పని లేకుండా పోయింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చైనా ఇలాంటి ఫ్రిగేట్ లని భారీ ఎత్తున తయారుచేసి దశల వారీగా ప్రస్తుతం ఉన్నవాటిని నావీ నుండి తీసేస్తుంది. కొన్ని వేల ఉద్యోగాలు పోతాయి. కానీ తప్పదు. 

ఇదే పని మనమూ చేస్తాము అంటే మన సైన్యం కూడా చేస్తుంది రాబోయే 10 ఏళ్లలో. అందుకే ఎక్కడ అయితే మానవ శక్తి అవసరం ఉంటుందో అంత వరకే ఉద్యోగాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో. అందరితో పాటే మనమూ వెళ్ళాలి! వెళతాం కూడా ! 

ఖాంగ్రేస్ ఇలాంటివి జరగనివ్వదు తోడుగా చైనా కుక్కలు ఉండనే ఉంటాయి బిస్కెట్ల కోసం ! కుక్కల జనాభా తగ్గాలి అంటే బలవంతంగా ఆపరేషన్ చేయాలి లేకపోతే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కరుస్తూనే ఉంటాయ్ !

జైహింద్.

Post a Comment

0 Comments