ఎలాంటి భోజనాన్ని చేయాలి ? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?
• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు.
• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.
• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు.
• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు.
• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.
• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం.
• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.
• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది.
• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి.
• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.
• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.
• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి. అన్నమునకు నమస్కరించాలి. అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు. వండిన వార్ని అభినందించాలి.
• అప్పుడే బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది.
• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ తగదు. ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు. భార్యకు సహితము పెట్టరాదు. పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది. భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.
• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి. విస్తరిలో ఏమీ మిగల్చరాదు. అవసరమైనంతే వడ్డించుకోవాలి. లేదా వడ్డించమని చెప్పాలి. ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.
• రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది.
• భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకి తిరిగి చేయాలి.
• తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.
• పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది. కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి.
• ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.
• ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి.
• మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.
• భోజనానికి ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.
• తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.
0 Comments