GET MORE DETAILS

శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకురారాదని అంటారు. ఎందుకు...?

శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకురారాదని అంటారు. ఎందుకు...? 



'ప్రసాదం' అంటే అనుగ్రహం. శివదర్శనంతో, అర్చనతో అనుగ్రహం సంప్రాప్తమవుతుంది. అయితే వస్తురూపేణ ఉండే నిర్మాల్యం మాత్రం తీసుకురారాదు. కానీ అన్నిచోట్లా ఈ నియమమే వర్తించదు. మహాశివభక్తుడైన 'చండే(డ్రే)శ్వరుడు' అనే ఒక దేవత తన తపస్సుకి ఫలంగా 'శివనిర్మాల్యం'పై అధికారాన్ని వరంగా సంపాదించుకున్నాడు. అందుకే ఆ నిర్మాల్యం అతడికే చెందాలి. ఆ కారణంచేతనే మనం ఇంటికి తీసుకురారాదు. శివలింగంపై నుండి వచ్చే తీర్థాన్ని మనం సేవించవచ్చు. కానీ గర్భగుడి ప్రాకారం బైట 'నాళం'(తూము) ద్వారా జారే తీర్థాన్ని మాత్రం సేవించరాదు. దానిపై కూడా చండేశ్వరునిదే అధికారం. అది అతడి సొత్తు. అయితే - జ్యోతిర్లింగాలు (కాశీ, శ్రీశైలం మొదలైనవి) ఉన్నచోట్ల మాత్రం శివనిర్మాల్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. స్ఫటిక, బాణలింగాలున్నచోట కూడా తీసుకోవచ్చు. చండేశ్వర ప్రతిష్ఠ లేని ఆలయాలలోనూ గ్రహించవచ్చు. ఇంకా స్వయంభూ (అరుణాచలం, కాళహస్తి - వంటివి) లింగములు వద్ద, సిద్ధ ప్రతిష్ఠిత లింగములు వద్ద నిర్మాల్యాన్ని స్వీకరించవచ్చు. 

కొన్ని శైవాగమాల ప్రకారం నివేదనల్లో 'చండభాగం' అని ఉంటుంది. అలా ఉన్న ఆలయాల్లో శివప్రసాదాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు.

Post a Comment

0 Comments