GET MORE DETAILS

తు.చ.తప్పకుండా జాతీయం వివరణ

 తు.చ.తప్పకుండా జాతీయం వివరణ



తు.చ. తప్పకుండా అనే పదాన్ని కచ్చితంగా లేక ఉన్నది ఉన్నట్లుగా అనే అర్ధం వచ్చేలా లేక ఈ పదాలకు మరింత బలాన్ని చేకూర్చేదిగా ఉపయోగించడం జరుగుతుంది.

తు.చ. తప్పకుండా ఎలా వచ్చింది ?

తు.చ. తప్పకుండా అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు పాటించవలసిన నియమాలలో పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉండాలనే ఒక నియమం ఉండేది. ఒక్కోసారి ఎనిమిది అక్షరాలు రాయటం కుదరనప్పుడు తు, చ, స్వ, హి, వై వంటి కొన్ని అక్షరాలను ఉంచవచ్చు. ఉదాహరణకు : రామాయ లక్ష్మనశ్చతు

తు.చ. తప్పకుండా తెలుగులోకి ఎలా వచ్చింది ?

మన కవులు కొంతమంది సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు సంస్కృత శ్లోకాలు వ్రాసిన వారు ఉపయోగించిన తు, చ, స్వ, హి, వై వంటి వాటికి సైతం కాని, అనే పదాలను ఉపయోగించి అనువాదం చేశారు. దేవభాష మీది గౌరవంతో తెలుగు కవులు తు, చ వంటి అక్షరాలను సైతం వదలి పెట్టకుండా కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేయడం వలన ఈనాడు కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనే పదాలు వాడవలసిన చోట తు.చ. తప్పకుండా అనే పదాం ఉపయోగంలోకి వచ్చింది."

Post a Comment

0 Comments