GET MORE DETAILS

కన్నడకంఠీరవుడు డా॥ రాజకుమారుడే కదా ! మరి కంఠీరవుడంటే అర్థమేమిటి ?

 కన్నడకంఠీరవుడు డా॥ రాజకుమారుడే కదా ! మరి కంఠీరవుడంటే అర్థమేమిటి ?



జి.బి.విశ్వనాథ.

9441245857. 

అనంతపురం.

(1)  కంబయ్య - కంబమునందు జనించినవాడు - నృసింహుడు. కంబ+ అయ్య - కంబయ్య.అయ్య అంటే పూజ్యుడనే అర్థము కూడా వుంది - కంబములో ఉద్భవించిన పూజ్యుడు. రాయలసీమలో కంబయ్య పేరుకలవారు చాలా మంది వున్నారు. కంబదూరు అనే మండలకేంద్రము కూడా వుంది. కంబ+ద+ ఊరు - కంబదూరు.కంబ-స్థంబము,ద - ఇచ్చునది లేదా సంభవించునది.నృసింహస్థానము. ఒకప్పుడిక్కడ నరసింహుని దేవాలయం ఏమైనా వుండేదేమో.

(2) ఉరవడి - అధికవేగము. ఉరువు - అధికము, వడి - వేగము, అత్యంతవేగము. వడివడిగా అడుగులు వేయాలి.

ఒరవడి - పిల్లలచే అక్షరాలు దిద్దించడము, పలక, ఇసుకలపై అక్షరాలు దిద్దించే సమయంలో గుండ్రని బంతిని చూపుతూ  అక్షరాలు అలా గుండ్రంగా ఉండాలని చెప్పడము.

కొత్త ఒరవడిలో ఆధునికత సాధించాలని నిర్ణయం.

(3) ఒఱట - వాడొట్టి ఒఱటోడు వాని జోలికెళ్ళోద్దు. ఒఱట అంటే మొండివాడు మూర్ఖుడనే అర్థాలు ఇప్పుడున్నప్పటికి దుర్మార్గుడనేదే నిజమైన అర్థము. 

మావూరి దగ్గరలోని పెడబల్లి అనే వూరి దగ్గర గుట్టలపైనుండి చిత్రావతి నది ప్రవహిస్తుంది. ఆ ప్రాంతాన్ని రంగప్ప ఒఱకాలు అనేవారు.ఒఱకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశా, చివరకు తెలిసిందేమిటంటే ఒఱకాలు అంటే పల్లము అని. ఇక్కడ చిత్రావతినది ఎత్తునుండి  కిందికి జాలువారి పల్లములోనికి ప్రవహిస్తుంది.

(4) వట్టము - నీ వల్ల నాకు ఈరోజు పదిరుపాయల వట్టము జరిగింది. వట్టమంటే నష్టమని,తరుగు అని అర్థాలున్నాయి. తరుగు అంటే కూరగాయలు తరుగులోని తరుగు కాదు, ఇక్కడ అరిగిపోవడం, సమసిపోవడమనే అర్థాలున్నాయి.

గుండె తరక్కు పోయింది. జోమలుక్కాస్ బంగారు అంగడిలో తరుగు ఎక్కువ, కొనొద్దు. నా కడుపు తరుక్కు పోతోంది.

(5) కంఠీరవము - సింహం, కన్నడ కంఠీరవుడనే బిరుదు ప్రఖ్యాత కన్నడనటుడైన స్వర్గీయ డా॥ రాజకుమారుడిని బిరుదు. కన్నడీగులలో సింగము వంటివాడు.



Post a Comment

0 Comments