GET MORE DETAILS

శాఖలకు సలహాదారులేంటి ? జీవోపై హైకోర్టు స్టే

 శాఖలకు సలహాదారులేంటి ? జీవోపై హైకోర్టు స్టే



సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు - హైకోర్టు.

ఏపీ దేవాదాయశాఖకు సలహాదారుడిగా జె.శ్రీకాంత్‌ నియామకంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.

ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

శ్రీకాంత్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలానే వదిలేస్తే రేపు అడ్వొకేట్‌ జనరల్‌కు కూడా సలహాదారును నియమిస్తారు. సలహాదారులను నియమించుకునేందుకు ప్రభుత్వంలో అధికారుల కొరత ఉందా ? సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు.

మంత్రులకు సలహాదారులంటే అర్థం ఉంటుంది, శాఖలకి సలహాదారులేంటి ?” అని ప్రభుత్వ న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

అనంతరం జీవో నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Post a Comment

0 Comments