GET MORE DETAILS

డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ను జయించడం ఎలా ?

 డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ను జయించడం ఎలా ?డయాబెటిస్ వ్యాధి కాని వ్యాధి . వ్యక్తి జీవన శైలి సరైన మార్గం లో లేనప్పుడు వచ్చేది . సరైన జీవన శైలిని అనుసరించడం ద్వారా దీన్ని సులభంగా  జయించొచ్చు .  మందులు వాడాల్సిన అవసరం లేకుండా హాయిగా జీవించొచ్చు .

మన తీసుకొనే ఆహారం లో 

1. కార్బోహైడ్రేట్లు { పిండి పదార్థాలు }

2. ప్రోటీన్ లు { మాంసకృత్తులు } 

౩. ఫ్యాట్స్ { కొవ్వు పదార్థాలు } 

4. విటమిన్లు ,  

5. మినరల్స్    

6. పీచు ఉంటాయి.

మనిషి పుట్టి నలబై లక్షల సంవత్సరాలయ్యింది . మన పూర్వీకులు ఎలాంటి ఆహారం తీసుకొన్నారు అనే దానిపై ఆధార  పడి,  సూక్ష్మ పరిణామ క్రమం లో మన శరీరం అందుకు అనుగుణంగా తయారయ్యింది . మానవ జాతి 99  శాతం సమయం ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారం { దుంపలు , కాయలు , పళ్ళు , వేటాడి చంపిన జంతువుల మాసం } పై ఆధార పడింది . వ్యవసాయం అంటే పంటలు పండించడం కేవలం అయిదు వేల సంవత్సరాల క్రితం మొదలయింది . అందులో మొన్నటి దాక పండించిన పంటలు వేరు . వాటిని పండించిన విధానం , వాటిలో పోషక విలువలు వేరు . అదీ కాకుండా పండించిన ధాన్యాలే తో పాటు  కాయలు,  పళ్ళు లాంటివి బాగా  తినే వారు .

మీరున్నారు . మా నాన్న గారు . తాతగారు . ఆలా వెనక్కు వెళితే మీకు కోటి ఇరవై లక్షల పూర్వీకులున్నారు . వారిలో మీది మీ నాన్న గారిది ఒక దారి . మిగతా కోటి ఇరవై లక్షల తొంబై  తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై ఎనిమిది మందిది ఒక దారి  . మీ పూర్వీకుల ఆహారపు అలవాట్లు మీ శరీరాన్ని ఏర్పరిచాయి . వారి దారిలో కాకుండా మీరు కొత్త దారిలో వెళుతున్నారు . దారితప్పిన మీకొచ్చేదే చక్కర వ్యాధి .

అంటే ఏంటిప్పుడు ? పూర్వీకులు గుహల్లో నివసించేవారు . ఆకులూ అలములు కట్టుకొనే వారు . కాబట్టి ఇప్పుడు మన కూడా అడవి మనుషులు అయిపోవాలా? బతికేది కొంతకాలం . హ్యాపీ గా తినకుండా ఈ సోది ఏంటి ? అనుకొంటున్నారా ? అయితే ఈ మెసేజ్ చదవడం ఇక్కడితో ఆపేయండి . మీ శరీరం .. మీ ఇష్టం .. ఇడ్లీ లు .. బిర్యానీలు .. కోక్ లు... పిజ్జా లు .. పరోఠా లు .. రెచ్చిపోండి . ఆపేదెవ్వడు . అడీగేదెవ్వడు . గాంగ్రీన్ .. ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి . జీవితం ముప్పావు వంతు నాశనం అయిపోయినప్పుడు ఈ మాట ఒక సారి వినిపిస్తుంది . అప్పుడైనా వినదగు నెవ్వరు చెప్పిన .. వినంతనే వేగపడక .. అనే ఆర్యోక్తి గుర్తుకు తెచ్చుకోండి.

చక్కెర వ్యాధి ని జయించడం ఎలా... ? 

అసలు ఇదొక వ్యాధే కాదు . శృతి తప్పిన జీవన శైలి రాగం .. దారి తప్పిన జీవనం.

తిండి తిన్నాక తొంబై నిముషాలకు మీ రక్తం లో గ్లూకోస్ శాతం చెక్ చేసుకోండి . ఇలాంటి మెషిన్ లు మెడికల్ షాప్ లో దొరుకుతాయి .  మీ రీడింగ్ 140  లోపు అయితే మీకు ఎలాంటి సమస్య లేదు . 140 - 180  మధ్యలో అయితే మీరు ప్రారంభ దశలో ఉన్నారు. 250  లోపు ఉన్నా ఫరవా లేదు . నేను చెప్పిన పద్ధతిలో ఈ సమస్య ను జయించొచ్చు . మూడు వందలు దాటితే మీకు ఇన్సులిన్ లోపం ఎక్కువ గా వుంది . బహుశా ఇప్పటికే మీరు ఇన్సులిన్ తీసుకొంటూ వుండొచ్చు . అప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వైద్యుడి సూచన మేరకు చెయ్యాలి . వీర మాచినేని గారు తనదైన డైట్ ను సూచిస్తూ ఎంతో మందికి ఉచిత సేవలు అందిస్తున్నారు . ఇలాంటి వారు ఆయన సూచనలు పాటించొచ్చు.

నేను చెప్పిన విధానం లో కొవ్వు తగ్గించుకోవచ్చు . బిపి ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు . రక్తం లో క్లోట్స్ రాకుండా చూసుకోవచ్చు . అంటే మెదడుపోటు, గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు.

డయాబెటిస్ కు ప్రధాన  కారణం ఒత్తిడి .. స్ట్రెస్ . మీకు తెలిసిన పదిమంది వివరాలు సేకరించండి . జనాలను స్థూలంగా రెండు రకాలుగా విభజించొచ్చు . స్ట్రెస్ పార్టీ . కూల్ పార్టీ . మొదటి రకం .. గాబరా మనుషులు . ప్రతి చిన్నదానికీ హైరానా పడిపోతుంటారు . ఇలాంటి వారిలో నూటికి తొంబై మంది నలబై దాటితే డయాబెటిస్ తెచ్చుకొంటారు . కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టు వుంటారు . ఏముందిలే అంటూ ముందుకు సాగిపోతారు . వీరు పొద్దున్న పది ఇడ్లీ లు తిన్న వెంటనే అయిదు అరటి పళ్ళు తిన్నా షుగర్ కంట్రోల్ లోనే  ఉంటుంది .ఆధునిక జీవనం అంటే పోటీ . పోటీ  పడితినే విజయం . నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే సక్సెస్ రాదు . పోటీ  పడుతూనే ఒత్తిడి ని జయించడం ఒక కళ. ఇది అందరూ నేర్చుకోవాలి . అదొక ప్రత్యేక పాఠం . మరో మెసేజ్ లో చెబుతాను . మీకు జ్వరం ఉన్నప్పుడు షుగర్ చెక్ చేసుకోండి . మామూలుగా ఉన్నదానితో పోలిస్తే ఎక్కువ రీడింగ్ వస్తుంది . కారణం జ్వరం వల్ల బాడీ లో స్ట్రెస్ . ఇది తాత్కాలికం . మనం తెచ్చిపెట్టుకున్న ఒత్తిడిని జయించాలి . లేకపోతె షుగర్ సమస్య ఖాయం 

షుగర్ సమస్య కు,  అధిక బరువుకు మరో ప్రధాన కారణం నిచ్చలమైన జీవన శైలి . అదేదో సినిమా లో బ్రహ్మానందం అన్నట్టు మా తాతే ఇలా చెయ్యకుండా ఉండివుంటే .. మన పూర్వికులు రోజంతా నడుస్తూ గడిపేశారు . వేట  ఆహార సేకరణ .. పోడు వ్యవసాయం .. సాంద్ర వ్యవసాయం,  చేతి వృత్తులు .. రోజంతా పనే .. నడకే . మనిషి శరీరం కూర్చోవడానికి అనుగుణంగా లేదు . ఇది కఠోర వాస్తవం . సరే .. అడవులకు పోలేము . వేటాడలేము .. నిజమే . కనీసం రోజుకు ఒక గంట కూడా నడవకుండా సోఫా సెట్- ముందు టీవీ -చేతిలో సొల్లు ఫోన్ -మరో చేతిలో చిరు  తిళ్ళు . ఇదేనా బతుకు ? బతకడం కోసం తినాలి . తినడం కోసమే బతుకుతాము అంటే ఎలా ? గాంగ్రీన్ లు గుండెపోట్లు కీళ్లనొప్పులు  రావా మరి ? రోజుకు కనీసం 45   నిముషాలు వేగం గా నడవడం అవసరం . పిల్లలు ఆటలు ఆడుతారు . ఆటలు ఆడడం ఆగిన వయసులో నడక మొదలవ్వాలి  . మరో విషయం.. నేను చెప్పబోతున్న ఆహార నియమాలు ఎవరో ముసలి ముతకకు మాత్రమే కాదు . చిన్న పిలల్లతో మొదలెట్టి ప్రతిఒక్కరికి.

ఉప్పు చంపేస్తుంది : 

రోజుకు ఒక రెండు గ్రాముల ఉప్పు రోజుకు  సరిపోతుంది . మనలో అధిక శాతం ఇంతకు పది రెట్లు  ఉప్పును శరీరంలోకి తోసేస్తున్నారు . అది వెళ్లి కీళ్లను తినేస్తుంది . బిపి ను పెంచేస్తుంది . ఉప్పులేని సాంబార్ ను తినమని చెప్పడం లేదు . జామ కాయ .. మామిడి కాయ కు కూడా ఉప్పు కావాలా ? ఉప్పు లేకుండా పెరుగన్నం తినగలరా ? వాక్ అనిపిస్తుంది కదా . ఒక రోజు ట్రై చెయ్యండి . అన్నాన్ని బాగా నమలండి . అందులోని కమ్మదనాన్ని రుచి చూస్తారు . ఆలా వారం              పాటు బలవంతంగా నైనా ఉప్పులేకుండా పెరుగన్నం తినండి . అటు పైన మీరు ఉప్పు వేసుకోవడం వల్ల పెరుగన్నమ రుచిని ఎంతగా కోల్పోతున్నారా గ్రహిస్తారు . లక్ష రూపాయిలు ఇస్తామన్నా పెరుగన్నం లో ఉప్పేసుకోరు . ప్రతి పూత ఫుడ్చా లో భాగంగా ఖీర తినండి . సర్రెల్లోకి వెళ్లే ఉప్పు తగ్గిపోతుంది.

పెద్దలు రోజుకు నాలుగు లీటర్ ల నీరు తాగాలి . పిల్లలు వారి వయసును బట్టి ఒకటి నుండి రెండు లీటర్ లు . ఉప్పేమో పది రెట్లు.. నీళ్ళేమో తాగాల్సిన దాంట్లో పదోవంతు కూడా తాగరు . మరి రోగాలు వస్తాయంటే రావా ? అధిక బరువు స్ట్రెస్ నిద్ర లేమి నీరసం ... . నీరు తాగక పోవడం వల్ల వచ్చే సమస్యల లిస్ట్ కొండవీటి చేంతాడు.

ఇక ఫుడ్ విషయం . డైట్ ప్లాన్ ఇవ్వండి అని చాల మంది అడుగుతున్నారు . ప్లాన్ లేదు .. పాడు లేదండీ .. చాల సింపుల్ .

పైన చెప్పిన ఆరు పోషకాల్లో మనకు కొవ్వు పదార్థాలు లోటు లేదు . కొవ్వు పదార్థాలు కాస్త ఎక్కువ తీసుకొన్నా సమస్య లేదు . అందరూ అనుకున్నట్టు రక్తం లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి అధిక  బరువు కు కారణం కొవ్వు కాదు . అసలు కారణం  పిండి పదార్థాలే  .

మీరు టిఫనీలు చేసారా ? ఏమి తిన్నారేంటి ? నాలుగు ఇడ్లీ  లు సాంబార్ చట్నీ . లేదా నాలుగు  దోశలు చట్నీ . లేదా పూరి చపాతీ బ్రెడ్ .. పొంగల్ .

స్థూలంగా చెప్పాలంటే మీరు మీ శరీరం లోకి తోస్తున్న ఆహారం లో 85  శాతం పిండి పదార్థాలే. ప్రతి దానికీ ఓ లెక్కుంటుంది . లెక్క తప్పితే చిక్కు . తీసుకోవలసిన ఆహారం లో పిండి పదార్తాలు యాభై శాతం మించకూడదు . అది ముప్పై శాతానికి తగ్గించినా సమస్య లేదు . 

ఒక  పక్క అధిక మొత్తం లో పిండి పదార్థాలు కడుపులోకి తోసేస్తూ మరో పక్క శరీర దృఢత్వానికి అవసరం అయిన మాంసకృత్తులు అందకుండా చేస్తున్నారు . ఇక కండెక్కడ ? చర్మం . దానికి కింద కొవ్వు .. అన్నట్టు మీరు తిన్న ఇడ్లీ దోస లాంటి పిండి పదార్తాలే కొవ్వు గా మారి పోతాయి . ముప్పై వస్తే ఫ్యామిలీ ప్యాక్ . నన్ను అంకుల్ అంటారేంటని ఫేస్బుక్ పై పోస్ట్లు . నలబై దాటితే కళ్ళ కింద క్యారీ బాగ్ లు ..  రావా మరి ?

తీసుకొనే ఆహారం లో ప్రోటీన్ అదే మాంసకృత్తులు  25  శాతానికి తగ్గకుండా చూసుకోవాలి . మన  దేశం లో నూటికి ఎనభై మంది ప్రోటీన్ లోపం తో బాధ పడుతున్నారు . కనీసం పది శాతం ప్రోటీన్ కూడా శరీరం లోకి పంపడం లేదు . ప్రోటీన్ తింటే కిడ్నీ లు పోతాయట . వామ్మో .. ఏమి జ్ఞానం అండీ బాబోయ్ . మడిసి వేట ఆహార సేకరణ దశలో ప్రధానంగా తిన్నది ప్రోటీన్ లు. కిడ్నీ లో పొయ్యే పనైతే మానవ జాతి  అంతరించిపోయి ఉండాలి . ఇతరత్రా కారణాల వల్ల ఇది వరకే కిడ్నీ సమస్యలు వున్నవారికి మిహాహాయింపు . మిగతా వారు శుభ్రంగా ప్రోటీన్ లు తీసుకోవచ్చు . 

ఇలా చెబితే పోస్ట్ లెంగ్త్ ఎక్కువవుతుంది . మీరు ఏమి తింటున్నారో అదే తినండి . కానీ అందులో పిండి పదార్థాలు  బాగా తగ్గించండి . నాలుగు ఇడ్లీ ల కు బదులు ఒక ఇడ్లీ . ముప్పై ఏళ్ళు లోపు ఉండి బాధిక బరువు లేనివారు నాలుగు ఇడ్లీ ల కు బదులు రెండు . ఇడ్లీ దోస పూరి  పొంగల్ . పేరు ఏదైనా పండించిన  ధాన్యాల్లో అంటే బియ్యం,  గోధుమ,  జొన్నలు , రాగులు,  సజ్జలు,  కొర్రలు లాంటి వాటిలో ఉండేది పిండి పధార్థాలు . వీటిని బాగా తగ్గించాలి . సగానికి సగం తగ్గించాలి . అంటే కడుపు మాడ్చుకోమని కాదు . నాలుగు ఇడ్లీ లు కడుపులోకి తోయడానికి మీరు వాడిన పదార్థం సాంబార్ చట్నీ . చట్నీ అంటే ఒక మాదిరి . సాంబార్ అంటే నీళ్ళే  కదా ? అందులో ఏముంది ? ఈ రోజు ఒక ఇడ్లీ దానితో బాటు సాంబార్ . కానీ సాంబార్ లో ఇడ్లీ తో పోలిస్తే అంతకు నాలుగు రెట్లు కాయగూరలు ఉండాలి . పచ్చి ఖీర కూడా తినొచ్చు . కాయగూరల్లో పీచు ఉంటుంది . విటమిన్ లు మినరల్స్ ఉంటాయి . కాన్సర్ నుంచి రక్షించే అంటి  యాక్సిడెంట్ లు ఉంటాయి . 

చికెన్ , మటన్ , చేపలు , గుడ్డు .. మాంసాహారులకు ; పన్నీర్ , జామ కాయ , బ్రోకలీ , పప్పు .. శాఖాహారులకు ఇవే ప్రధానంగా ప్రోటీన్ లు ఇచ్చే ఆహారం . ఇవి బాగా తినాలి .

ఇదే ఫార్ములా లంచ్ కి డిన్నర్ కి. మీరు తినేదే తినండి . కానీ పిండి పదార్థాలు బాగా తగ్గించాలి . అధిక బరువు,  చక్కర వ్యాధి తీవ్రంగా ఉన్న వారు పిండి పదార్థాలను ముప్పై శాతానికి తగ్గించాలి . ఒకటి చెప్పనా . మనం  తినే కాయగూరల్లో కూడా పిండి పదార్థాలుంటాయి . అవి చాలు . ప్రోటీన్ లు బాగా పెంచాలి . చికెన్ బిర్యానీ తింటున్నారు . అందులో రైస్ మూడో వంతు కు తగ్గించండి . ఒక ఖీర . చికెన్, రైస్ కు  రెండు రెట్లు వీలయితే మూడు రెట్లు  . అన్నం - పప్పు తింటున్నారు . అన్నం ఒక కప్పు . పప్పు ఒక కప్పు .. వీలైతే రెండు కప్పులు పప్పు  . ఖీర లాంటి పచ్చి కూరలు . ఆకుకూరలు కూడా తినండి  . సాంబార్ అన్నం తింటున్నారు . అన్నం  ఒక కప్పు . సాంబార్ లో ముక్కలు అన్నానికి నాలుగు రెట్లు . బంగాళాదుంప అన్నం లాంటిదే . ఇది వద్దు  బెండ కాయ బీర కాయ సొర కాయ . వంకాయ మీ ఇష్టం .. మీ టేస్ట్ . ఎలా వండుకొంటారు  .. ఎలా తింటారు అనేది మీ ఇష్టం.

తెల్లన్నం అధమం. దానికంటే బిర్యాని రైస్ కాస్త బెటర్. దానికంటే బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం బెటర్. దానికంటే జొన్నలు సజ్జలు రాగులు బెటర్. దానికంటే కొర్రలు లాంటివి బెటర్. మీ ఇష్టం. మీ బడ్జెట్. మీ టేస్ట్. కానీ ఇలాంటివి బేసిక్ గా పిండి పదార్తాలు. యాభై శాతానికి దాటకూడదు. బరువు తగ్గాలి అనుకొనే వారికిస్ షుగర్ కంట్రోల్ చెయ్యాలి అనుకొనే వారికి ముప్పై శాతం చాలు.

ఇక గోధుమలు... గోధుమ రొట్టి తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అనేది పచ్చి బూతు. పిండమరకు వెళ్లి గోధుమలను మర పట్టిస్తే అదొక రకం. అది కూడా పిండి రూపమా లో ఉండడం తో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే కాలేయం పై అంట తక్కువ ఒత్తిడి. ఈ రోజుల్లో గోధుమ పిండి లో మైదా కలుపుతున్నారు. అందుకే అవి మెత్తగా ఉంటాయి . నాన్ , చుక్క రోటి , తొక్క రోటి , అన్నీ మైదాలే. తింటే కోలన్ కాన్సర్ ఖాయం. పరాటాలు ఎక్కువ తినే తమిళుల్లో ఈ రకం కాన్సర్ అధికముతోంది. రాత్రి పరోటా నో తొక్క రోటి { అదే లెండి చుక్క  రోటి } నో తింటే ఆరోగ్యం అని అమాయకులు రోగాలను కొని తెచ్చుకొంటున్నారు.

పైన చెప్పిన ప్రోటీన్ లు వాటితో పాటు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువాగా తినాలి. వీటిలో పీచు విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గాలి అంటే కొంతమంది కడుపు మాడ్చుకొంటారు. ఇది అజ్ఞానం. బరువు తగ్గాలి అని మందులు మాకులు తింటే కిడ్నీ లు పోతాయి. లో  కెలొరీ ఫుడ్ తినడం ఒకటే బరువు తగ్గడానికి సరైన ఆహారం. ఆకుకూరలు కాయగూరలు లో  కెలొరీస్ ఆహారం. దుంప కూరలు వదిలెయ్యండి. వాటిలో పిండి పదార్థాలు అధికం.

కడుపు నిండా అన్నం... ఇదొక పెద్ద అజ్ఞానపు మాట. అన్నం అంటే రైస్ అనే అర్థం లో తీసుకొంటే అది పిండి పదార్థాలు  భోజనము అవుతుంది. పోనీ  ఆకుకూరలు కాయగూరలు కూడా అన్నం అనే పదం లోకి వస్తాయి అనుకొంటే అసలు కడుపు నిండా ఎపుడూ తినకూడదు. కాస్త ఖాళీ పెట్టాలి. వంద తింటే కడుపు  నిండుతుంది  అంటే ఎనబై చాలు.

ఇక పళ్ళు... పళ్ళు తింటే షుగర్ సమస్య రాదు. షుగర్ సమస్య ఉన్న వారికి పళ్ళు మంచివి కావు. ఈ రెండు వాక్యాల్లో మొదటిది పూర్తిగా కరెక్ట్. చిన్నపటినుంచి పిలల్లకు పళ్ళు ఆహారంగా ఇస్తే వారికి  పెద్దయ్యాక కాన్సర్ షుగర్ బిపి లాంటి రోగాలు రావు. అన్నం తిన్నాక పళ్ళు తినకూడదు. పళ్ళని ఖాళీ కడుపులో తినాలి. పళ్ళు తిన్నాక కనీసం రెండు గంటలు అన్నం తినక పొతే మంచిది. షుగర్ సమస్య వున్నవారు నేను చెప్పినట్టు గా పిండి పదార్తాలు బాగా తగ్గిస్తే సాయంకాలం వాకింగ్ ముందు ఒక పండు తినొచ్చు. మీ షుగర్ లెవెల్ ను తరచూ చెక్ చేసుకోండి. పిండి పధార్థాలు ఎంత మేర తగ్గించాలి,  పండు తినొచ్చా,  తింటే బాగా తియ్యటి మామిడి అరటి లాంటివి కూడా తినొచ్చా అనేది మీ షుగర్ లెవెల్ బట్టి ఉంటుంది. 180 దాక ఉంటే ఏమీ కాదు. తిండి తిన్నాక తొంబై నిమషాలకు వచ్చే రీడింగ్  ఒక నెల పాటు రెగ్యులర్ గా చెక్ చేసుకొంటే మీ శరీర తత్త్వం మీకే అర్థం అయిపోతుంది. దాన్ని  బట్టి ప్రొసీడ్  అయిపోవచ్చు. అటు పైన నెలకో ఒక సారి షుగర్ లెవెల్ చెక్ చేసుకొంటే చాలు.

షుగర్ సమస్య లేని వారు మాకేంటి ఎంతైనా పిండి పదార్థాలు హ్యాపీ గా తినేయొచ్చు అనుకొంటున్నారా ? సమస్య ఒక్క షుగర్ తోనే కాదు పిండి పదార్తాలు ఎక్కువైతే కొవ్వు , ఫామిలీ ప్యాక్. కీళ్లనొప్పులు , రక్తం లో క్లోట్స్ , ఇలా చాలా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ మీకు కాదులెండి. ఫార్మసురులకు

ఇవి కాకుండా ప్రకృతి లో దొరికే ఆహారం తాటి ముంజెలు, రేగు పళ్ళు , కొబ్బరి , గేగులు ఇలాంటి వాటిని బాగా తినండి . ప్యాకెట్ లో వచ్చే ఆహారం లో అధిక శాతం విషమే. పొలాల్లో అడవుల్లో బండ్ల పైన దొరికే ఆహారం అమృతం . వాల్ నట్స్ చాల అవసరం ప్రతి రోజు రోజుకు రెండు మూడు ఎప్పుడో ఒక సారి తినాలి . షుగర్ సమస్యలేని వారికి, నేను చెప్పిన పద్ధతిలో దాన్ని జయించిన వారికి డ్రై ఫ్రూప్ట్స్ మంచి ఫుడ్ . వేరుశనగలు లాంటి నట్స్ మంచివి.పోస్ట్ ను కనీసం రెండు సార్లు చదవండి . బాగా అర్థం చేసుకోండి .

Post a Comment

0 Comments