GET MORE DETAILS

ఆరోగ్యం - జనపనార విత్తనాలు గురించి విన్నారా..!!

 ఆరోగ్యం - జనపనార విత్తనాలు గురించి విన్నారా..!! 



ఇవి జనపనార మొక్క నుంచి వస్తాయి.. ఇది చక్కటి పౌష్టిక ఆహారంగా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్స్ , విటమిన్స్, మినిరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ ఉన్నాయి. వీటితో పాటు 21 అమైనో ఆమ్లలను కూడా కలిగి ఉంది.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..!

జనపనార విత్తనాలు తో అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

జనపనార విత్తనాలు లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. జనపనార విత్తనాలు హార్మోన్ రెగ్యులేటర్ గా పనిచేస్తాయి. గ్రంధులు ఇది ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది చక్కటి పోషకాహారం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

జనపనార విత్తనాలను ప్రతి రోజు తీసుకోవడం వలన పెద్ద ప్రేగు క్యాన్సర్ ను తగ్గించడానికి సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీనిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం గా చెప్పవచ్చు. పొటాషియం లో ఉండే సరటోనిన్ తలనొప్పి, పార్శ్వనొప్పి, మైగ్రేన్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వలన చక్కటి నిద్ర పడుతుంది. దీని లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఎముకలలో గుజ్జు పెరగడానికి, ఎముకలు పటిష్టంగా తయారవుతావడనికి, ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఇంకా ఎముక సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుపడుతుంది. జనపనార లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది. జనపనార లో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇంకా ఇది సోడియం కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన త్వరగా ఆకలి అనిపించదు చిరుతిళ్ల జోలికి వెళ్ళరు. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి లను క్రమబద్దికరించెందుకు సహాయపడతాయి.. వీటిని తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి, మెనోపాజ్, డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది.

Post a Comment

0 Comments