Shortest day | రేపే షార్టెస్ట్ డే. పగలు నిడివి 10 గంటల 40 నిమిషాలే...
Shortest day | ఇవాళ త్వరగా చీకటి పడిపోయిందే..! అని అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం. అది కేవలం వాతావరణంలో మార్పుల కారణంగా త్వరగా రాత్రి వచ్చినట్లుగా భ్రమపడుతుంటాం. వివిధ నగరాల్లో రోజు నిడివి కొన్ని నిమిషాలు ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంటాయి. అయితే, మీరు అనుకుంటున్నట్లుగా రేపు చాలా త్వరగా చీకటి పడబోతున్నది.
ఖగోళంలో మార్పులు కొన్నిసార్లు డిసెంబర్ 21 న వస్తుండగా.. ఇంకొన్నిసార్లు 22 వ తేదీన జరుగుతాయి. ఇంతకుముందు 2020 లో డిసెంబర్ 21 న షార్టెస్ట్ డే వచ్చింది. కాగా, ఈసారి డిసెంబర్ 22 వస్తున్నది. షార్టెస్ట్ డే అంటే తక్కువ పగలు ఉండి, రాత్రి సమయం ఎక్కువగా రోజు. సాధారణంగా పగటి సమయం 12 గంటలుగా ఉంటుంది. అయితే, ఈ షార్టెస్ట్ డే నాడు మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాల నిడివి ఉండనున్నది.
ఉజ్జయిని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా ప్రకారం, ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22న సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. అంటే దీని తర్వాత ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలోని దేశాలలో సూర్యకాంతి చాలా కాలం పాటు భూమిపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీనిని అతిపెద్ద రోజుగా పిలుస్తారు.
0 Comments