GET MORE DETAILS

గ్రామ , వార్డు సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ కి అప్లై చేసే విధానం

గ్రామ , వార్డు సచివాలయాల్లో మ్యారేజ్  సర్టిఫికెట్ కి అప్లై చేసే విధానం



పెళ్లి జరిగిన చోటు పల్లె అయితే పంచాయితీ సెక్రటరీ గారు, మునిసిపాలిటీ ఏరియా లో అయితే మునిసిపల్ కమీషనర్ గారు ఇస్తారు.

● మ్యారేజ్ సర్టిఫికెట్ ఎక్కడ అప్లై చేయాలి ?

పెళ్లి జరిగిన ప్రదేశం కి సంబందించిన సచివాలయం లో అప్లై చేసుకోవాలి.  ( పెళ్లి జరిగిన  ఏరియా సచివాలయం పేరు తెలిస్తే ఏ సచివాలయం లో అయినా అప్లై చేయవచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ పెళ్లి అయిన చోటు కు ఫార్వర్డ్ అవుతుంది. అక్కడికి వెళ్లి అప్రోవ్ చేయించుకోవాలి)

అప్లై చేయడానికి కావలసిన వివరాలు :

1. పెళ్లి పత్రిక 

2. పెళ్లి ఫోటో 

3. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆధార్ కార్డులు 

4. పెళ్లి కొడుకు తరుపున ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులు, పాస్ పోర్ట్ ఫోటోలు .పెళ్లి కూతురు తరుపున ఇద్దరు సాక్షుల ఆధార్ , పాస్ ఫోటోలు

5. SSC మార్క్స్ కార్డ్ జిరాక్స్ (టెన్త్ పాస్ అయి ఉంటే )

6. అప్లికేషన్

అప్లికేషను సచివాలయం లో ఆన్లైన్ చేసేటప్పుడు భార్య భర్త ఇద్దరు ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP చెప్పవలసి ఉంటుంది.

● అప్లికేషన్ ఫీజు 150 రూపాయలు 

ఆన్లైన్ పూర్తి అయిన తరువాత పంచాయితీ సెక్రటరీ లేదా మునిసిపల్ కమీషనర్ గారి దగ్గర హాజరు అయ్యి అప్రోవ్ చేయించుకోవాలి.

తరువాత అప్లై చేసిన సచివాలయం లో సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలి.

Post a Comment

0 Comments