GET MORE DETAILS

కనుమ పండుగ విశిష్టత

కనుమ పండుగ విశిష్టత సంక్రాంతి (Sankranthi) తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ (Kanuma festival). కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

 కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను (Cattle) పూజించడం ఆచారంగా పాటిస్తారు.

 ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి (Pongali) వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం (Poli challadam) అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

 ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం (Believe). ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు బెలూన్లతో అందంగా అలంకరించి (Beautifully decorated), కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు.

 వారికి పంట పండించడంలో (Harvesting the crop) సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెల్లో కనుమకు ఒక ప్రత్యేకత (Specialization) ఉంది. ఈ రోజున మినుములు తినాలనే ఆచారముంది. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు.

 ఈ రోజున ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం (Return journey) చేయనివ్వరు. కనుమ రోజున మాంసాహారం (Non-vegetarian) వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు.

 కనుమ రోజున పెరుగును (Yogurt) దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు (Bullock cart races), కోడిపందాలు నిర్వహిస్తుంటారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలో అందంగా కనిపిస్తుంది.

 ఇలా సంక్రాంతి చివరి రోజులు జరుపుకునే కనుమ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. కనుమ పండుగ రోజున రైతులు పంట పండించడంలో సహాయపడిన పశువులను అందంగా అలంకరించి వాటికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం. అందుకే కనుమ పండుగను పశువుల పండుగ (Cattle Festival) అని కూడా అంటారు.

Post a Comment

0 Comments