GET MORE DETAILS

రథసప్తమి : కుజ దోషం, శని దోషం నుంచి బయటపడేసే సూర్యభగవానుడి ఆలయం.

రథసప్తమి : కుజ దోషం, శని దోషం నుంచి బయటపడేసే సూర్యభగవానుడి ఆలయం.అనారోగ్యం, రుణ బాధలు, కెరీర్లో పురోగతి లేకపోవడం. అన్నింటికీ కారణం గ్రహస్థితి బాగాలేకపోవడం అని విశ్వసించే వారున్నారు. ఇలాంటి బాధల నుంచి విముక్తి కలిగించే ఆలయం ఉందని తెలుసాజనవరి 28 శనివారం రథసప్తమి..ఈ సందర్భంగా జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించే సూర్యనార్ ఆలయం గురించి ప్రత్యేక కథనం.

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ జగతికి వెలుగునిచ్చే ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలసి వెలసిన ప్రాంతమే కుంభకోణంలో సూర్యనార్ దేవాలయం. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సూర్యభగవానుడు మధ్యలో ఉంటే చుట్టూ మిగిలిన 8 గ్రహాల ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఉన్న సూర్యనార్ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు - రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!

రథసప్తమి: 

ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధాన ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమి ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం..భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుందంటారు పండితులు. 

రథసప్తమి రోజు ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి

తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు, ఏడు జన్మల్లో చేసిన పాపాలకు, ఏడురకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు.

నదుల దగ్గర స్నానమాచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది.

రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.

రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.

పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారుతులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

రథసప్తమి రోజు సూర్యుడిని  ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.

రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగి..ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి చిన్న  రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు.

రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని విశ్వాసం.

ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం.

సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారం అయిన సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు. ఓం హ్రీం సూర్యాయ నమః"

॥ శ్రీ సూర్య స్తోత్రం ॥

ధ్యానం |

ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |

ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం

భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 

కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 

బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః ||

ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |

సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||

పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |

అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || 

కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |

ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || 

సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ] 

క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || 

సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |

ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |

సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || 

ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ 

సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!రథసప్తమి 2023: జనవరి 28 శనివారం రథసప్తమి. ఆదిత్యుడికి అత్యంత ప్రియమైన ఈ రోజున ఆకాశంలో నక్షత్ర కూటమి రధం ఆకారంలో కనిపిస్తుందట. ఈ రోజున ప్రత్యక్షదైవం అయిన సూర్యుడిని పూజించడం వెనుక విశిష్టత ఏంటంటే..చీకట్లను పారద్రోలి సమస్త లోకానికి  వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంత్రం శ్రీ మహా విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్య భగవానుడిని ప్రత్యక్షదైవంగా కొలుస్తారు. అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు సూర్యుడు అవతరించిన రోజే సూర్య జయంతిగా,రథ సప్తమిగా జరుపుకుంటారు.  సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు.. రథానికి ఉండే న్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతం. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం(ఆదివారం)పుణ్యాన్ని ప్రసాదించే మాఘమాసం

మేషం నుంచి మీనం వరకూ పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి సూర్యుడి రథానికి ఏడాది పడుతుంది. ఈ పన్నెండు రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆదిత్యుడిని ఒక్కో నెల ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు. మాఘ మాసంలో సూర్యుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదనిని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. వాస్తవానికి ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి నుంచి ప్రారంభమైనప్పటికీ..పూర్తిగా మొదలయ్యేది మాత్రం రథసప్తమి నుంచే.  సంక్రాంతి సమయానికి దక్షిణ దిక్కున ప్రయాణం పూర్తిచేసుకుని..రథ సప్తమి నుంచి ఉత్తర దిక్కున ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.భగవంతుడు లేడు అనేవారు ఉండచ్చుగానీ..వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన..నిత్యం కనిపించే సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు..ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యంకాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించేవారెందరో.  ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది (2023) రథసప్తమి జనవరి 28 శనివారం వచ్చింది

విధినిర్వహణలో ఆదర్శం :

విధినిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు..ఉదయం, సాయంత్రం ఎప్పుడూ వేళను అతిక్రమించడు. ఆహారానికి, సంపదకు మూలపురుషుడు

సృష్టిలోని సంపదకు, ఆహారానికి ఆదిత్యుడే మూలపురుషుడు. సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుడిని ప్రార్థిస్తే..అక్షయ పాత్ర ప్రసాదించింది సూర్యుడే.  సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతక మణిని పొందుతాడు. ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది. 

విజ్ఞానానికి మూలం సూర్యుడు :

విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు . సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ అందిస్తున్నది సూర్యుడే. జీవుల పుట్టుకకు, పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తుంది.

శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు. పంచ భూతాల్లో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరుచక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు..వెలుగు అన్నిటికన్నా వేగవంతమైనది. 

సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. 

అందుకే సూర్యుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటూ..ఆయుష్షు,  ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు.

"ఓం హ్రీం సూర్యాయ నమః"

సూర్య గాయత్రి మంత్రం

ఓం భాస్కరాయ విద్మహే మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.

విధినిర్వహణలో ఆదర్శం విధినిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు. ఉదయం, సాయంత్రం ఎప్పుడూ వేళను అతిక్రమించడు.

Post a Comment

0 Comments