GET MORE DETAILS

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా నటాషా



వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్‌ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్‌(13) వరుసగా రెండో ఏడాది ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యంత చురుకైన విద్యార్థులను, తమ వయసు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని వెలికి తీసేందుకు అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) ఏటా విభిన్న పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300కి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనగా కేవలం 27శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది. న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్‌ స్కూల్‌లో చదువుతున్న ఈ బాలిక 2021లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాల్గొని తన ప్రతిభ చాటింది. అప్పటికి ఐదో గ్రేడ్‌ (అయిదో తరగతి) చదువుతున్న తను.. ఎనిమిదో తరగతి విద్యార్థి స్థాయి ప్రతిభ చూపింది. చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు.

Post a Comment

0 Comments