మన ఆరోగ్యం మన చేతుల్లో - బిళ్ళగన్నేరు ఔషదం యొక్క ఉపయోగాలు.
Billa Ganneru : మనిషి ప్రకృతిలో ఓ భాగం.. అందుకనే మనిషి జీవించడానికి కావల్సిన ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదిస్తుంది.. అంతేకాదు.. మనిషికి వచ్చే శారీరక రుగ్మతలను ప్రకృతి ప్రసాదిత ఔషధాలతో పోగొట్టుకోవచ్చు.. మొక్కలు, పండ్లు, పువ్వులు, కాయలు, గింజలు ఇలా మొక్కలో ఏదొక భాగాలు మానవుడికి ఏదొక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. అలా ప్రకృతిలో అందమైన మొక్కగా పేరొందిన బిళ్ళ గన్నేరు మొక్క లో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయి.. పింక్, తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఎక్కువగా గార్డెన్ లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు.. కానీ ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, వేర్లు అనేక వ్యాధులను నయం చేస్తుంది. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు.. మరి ఈ బిళ్ళ గన్నేరు మొక్క వల్ల మనకుగల ఉపయోగాలు ఏమిటో తెలుసుకొందాం..!
మధుమేహం (షుగర్ వ్యాధి) నివారణకు :
ముందుగా బిళ్ళ గన్నేరు మొక్క వేర్లను సేకరించి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. అనంతరం ఆ వేళ్ళను ఎండబెట్టి.. పొడి చేసుకొని గాలి నీరు తగలకుండా భద్రపరచుకోవాలి.. ఉదయం పరగడుపున, రాత్రి ఆహామ్ తినే ముందు ఆ పొడిని అరగ్రాము తీసుకొని ఆ పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తినాలి.. అంతేకాదు.. ఆ మొక్క ఆకులను గానీ పువ్వులను గానీ రెండు మూడు ఉదయం పరగడుపున నమిలి తినాలి.. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే.. ఎటువంటి షుగర్ వ్యాధి అయినా తగ్గుతుంది.
క్యాన్సర్స్ తగ్గుముఖం పట్టడానికి :
బిళ్ళ గన్నేరు మొక్క ఆకుల రసం తో పాటు వేళ్ళ ను ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి.. అలా చేసుకొన్న పొడి తో టీ మాదిరి డికాషన్ కాచి రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది. వీటిలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వుద్ధిని తగ్గిస్తుంది కనుక క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు :
బిళ్ళ గన్నేరు ఆకుల ను బాగా కడిగి రసం తీసుకొని ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ మోతాదులో తాగితే అధిక రక్త పోటు అదుపులో ఉంటుంది.
మహిళలకు వచ్చే రుతు సమస్యల నివారణకు :
రుతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం ఈ బిళ్ళ గన్నేరు ఆకులు కలిగిస్తాయి.. 8 ఆకులను 2 కప్పుల నీటిలో వేసి అరకప్పు నీరు అయ్యేలా బాగా మరిగించాలి. ఆ నీటిని స్త్రీలు రుతు సమయంలో తాగితే.. తీవ్ర రక్త స్రావం కాకుండా ఉంటుంది.. నొప్పి వంటివి తగ్గుతాయి.
యాంటీ సెప్టిక్ క్రీమ్ :
గాయాలు, పుండ్లు ఉన్న ప్లేస్ లో ఈ ఆకులను నలిపి పేస్ట్ లా చేసి. అప్లై చేస్తే.. వెంటనే అవి తగ్గుముఖం పడతాయి.. ఇలా రోజుకి 2, 3 సార్లు చేస్తే గాయాలకు యాంటీ సెప్టిక్ క్రీమ్ లా పనిచేస్తుంది.
నోటి సమస్యలకు :
ఎప్పుడైనా నోటి నుంచి రక్త స్రావం వచ్చినా.. నోట్లో పుండ్లు ఏర్పడినా.. బిళ్ళ గన్నేరు మొక్క పువ్వుల మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలను వేరు వేరుగా రసం తీసి రెండిటినీ కలిపి ఆ రసం నోట్లో వేస్తే రక్త స్రావం తగ్గుతుంది.. నోట్లీ పుండ్లు కూడా తగ్గుతాయి.. ఇక ముక్కు నుంచి రక్త స్రావం వచ్చినా ఇదే రసం ముక్కు లో వేస్తే రక్త స్రావం ఆగుతుంది.
చర్మ సౌందర్యానికి :
మొటిమలు, మచ్చలను పోగొట్టుకోవాలంటే.. ఈ ఆకుల ను ఎండబెట్టి.. పొడి చేసి ఆ పొడికి వేపాకు పొడి, పసుపు కలిసి ఆ మిశ్రమాన్ని పేస్ట్ చేసుకొని ముఖానికి పట్టించాలి.. అలా తరచుగా చేస్తే, ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గి.. ముఖం కాంతి వంతంగా మృదువుగా మారుతుంది.
దద్దుర్లు, దురద :
పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు, దురద పెడుతుంటే.. ఆ ప్రాంతంలో బిళ్ళ గన్నేరు ఆకుల రసం అప్లై చేస్తే.. వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.. నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి.
మానసిక సమస్య :
మానసిక ఒత్తిడి, ఆందోళన తో డిప్రెషన్ లో ఉండి నిద్ర పట్టకుంటే.. ఈ మొక్క ఆకులను రసాన్ని త్రాగితే నిద్ర పడుతుంది.
0 Comments