GET MORE DETAILS

మన ఆరోగ్యం మన చేతుల్లో : ఆరోగ్య చిట్కాలు

 మన ఆరోగ్యం మన చేతుల్లో : ఆరోగ్య చిట్కాలు



"కొబ్బరి నూనె" :  గోరువెచ్చగా  చేసి  జుట్టుకు  పట్టించి మసాజ్  చేయండి.

"ఉసిరి" :  మెత్తగా  పేస్ట్  చేసి  తలకు  పట్టించండి.

గుడ్డు" : ఎగ్ వైట్ కు  కొద్దిగా  నూనె  కలిపి  తలకు  పట్టించి  తర్వాత  తలస్నానం  చేయండి.

"ఆముదం, బాదం ఆయిల్" :  ఈ రెండింటిని  మిక్స్  చేసి  తలకు  పట్టించి  మసాజ్  చేయండి.

బయటకు  వెళ్లినప్పుడు  కాలుష్యం  నుంచి  జుట్టును  రక్షించుకోవడానికి  తలకు  క్యాప్,  స్కార్ఫ్  వాడండి.


"ఆయుర్వేదం"

నిమ్మకాయ రసంలో  కొద్దిగా  ఉప్పు  కలిపి  మెడ మీద  రుద్దుకొని  5 నిమిషాల  తర్వాత  కడిగేసుకోవాలి.  నిమ్మకాయలోని  విటమిన్-C  మెడ మీద  ఉన్న  మృత కణాలను నాశనం  చేస్తుంది.  అలాగే  సూర్యరశ్మి  వలన  వచ్చే  నలుపును  కూడా  తొలగిస్తుంది.

ఒక స్పూను  గంధంలో  కొద్దిగా  రోజ్ వాటర్  కలిపి  మెడ మీద  రాత్రి  పడుకునే  ముందు  పెట్టుకొని  ఉదయాన్నే  కడిగేసుకుంటే  మెడ  తెల్లగా  అవుతుంది.


"ఆయుర్వేదం  చిట్కాలు"

ప్రతిరోజూ  ఒక  కప్పు  నల్ల ద్రాక్ష  రసం  తీసుకుంటే  గుండెపోటుకు  దూరంగా  ఉండవచ్చు.

పడుకునేటప్పుడు  ఎడమ  పక్కకు  తిరిగి  పడుకుంటే  ఎసిడిటి  వెంటనే  తగ్గిపోతుంది.

10  తులసి  ఆకుల రసం  ఒక కప్పు  చొప్పున  రెండు  పూటలా  తీసుకుంటే  చర్మ వ్యాధులు,  రాషెస్ కు  సంబంధించి  వెంటనే  ఫలితం  కనిపిస్తుంది.

రెండు స్పూన్లు  ఉసిరి రసం,  తేనెను  అరకప్పు  నీటిలో  బాగా  కలిపి  3 పూటలా  సేవిస్తే  బీపీ  తగ్గుముఖం  పడుతుంది.


  "స్ట్రాబెర్రీ" 

స్ట్రాబెర్రీ లో  విటమిన్లు  మరియు  ఫైబర్  ఎక్కువగా  ఉంటాయి.  అందుచేత  బరువు  తగ్గాలి  అనుకునేవారికి,  మధుమేహంతో  బాధపడేవారికి  ఇది  అద్భుతమైన  పండు గా  చెప్పుకోవచ్చు.


"సమ్మర్ లో  ఈ 'బియ్యం'  తినండి" 

వేసవి కాలంలో  సగ్గు జావ  తాగితే  చాలా  మంచిది.  ఎందుకంటే  సగ్గు బియ్యంలో  కార్బోహైడ్రేట్లు  పుష్కలంగా  ఉంటాయి.  దాంతో  అలసిన  శరీరానికి  తక్షణ  శక్తి  అందుతుంది.  అంతేకాకుండా  ఇది  జీర్ణక్రియకు  మేలు  చేస్తుంది.  సగ్గు బియ్యంలోని  పొటాషియం  రక్త ప్రసరణను  సాఫీగా  చేసి  గుండె  మీద  ఎక్కువ  ఒత్తిడి  పడకుండా  సాయపడుతుంది.  దీంతో  రక్తపోటు  అదుపులో  ఉంటుంది.  సగ్గు బియ్యంలోని  క్యాల్షియం  వల్ల  ఎముకలకు  బలం  పెరుగుతుంది.


"బార్లీ  నీళ్లు  తాగడంతో  కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు"

పేగుల్లో  ఉండే మలినాలు  తొలగిపోతాయి.

క్యాన్సర్ ను  నివారిస్తాయి.

కిడ్నీలను  ఆరోగ్యంగా  ఉంచుతాయి.

బరువు  తగ్గవచ్చు.

చర్మానికి  మెరుపు  తీసుకొస్తాయి.

హార్మోన్లు  చక్కగా  పనిచేస్తాయి.

కీళ్ల నొప్పులు,  మోకాళ్ల నొప్పలు  తగ్గుతాయి.

రక్తంలో  చక్కెర  నిల్వలు  పెరిగే  అవకాశం  తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ను  కరిగిస్తుంది.


"రోజు  ఒక కప్పు  ఉడకబెట్టిన   శనగలు  తినడం  వలన"

గుండె జబ్బులు  దరిచేరవు.

రోజంతా  ఉత్సాహంగా  ఉంటారు.

కాలేయం  సమస్యల నుంచి  త్వరగా  కోలుకుంటారు.

ఒత్తిడి,  ఆందోళన  దూరం  అవుతాయి.

జీర్ణ సమస్యలు  తగ్గుతాయి.

ఎముకలు  దృఢంగా  మారుతాయి.

రక్త సరఫరా  మెరుగుపడి  బీపీ  కంట్రోల్లో  ఉంటుంది.


"ఏ డ్రై ఫ్రూట్ తో  ఏం లాభం' ?

''జీడిపప్పు'' :  విటమిన్ ఎ, బి6  అధికంగా  ఉంటాయి.

"వాల్ నట్స్" :  పోషకాలు  ఎక్కువ  ఒమేగా-3  ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్స్,  ప్రొటీన్స్,  పోషకాలు,  విటమిన్స్,  మినరల్స్  లభిస్తాయి.

ఎండు ద్రాక్ష" :  అసిడిటీతో  పాటు  జీర్ణ సంబంధిత  సమస్యలు  కూడా  తగ్గుతాయి.

"పిస్తా" :  గుండెకు  ఎంతో  మేలు  చేస్తుంది.  తరచూ  తింటే  మధుమేహం,  చెడు కొలెస్ట్రాల్ ను  తగ్గిస్తుంది.

"బాదం" :  జుట్టు,  చర్మం,  పళ్ల  ఆరోగ్యం,  శ్వాస,  గుండె,  మలబద్ధక  సమస్యలను  తగ్గిస్తాయి.


"జీడిపప్పు  తినడంతో  కలిగే  ఆరోగ్య  ప్రయోజనాలు"

అధిక  రక్తపోటును  తగ్గిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థను  మెరుగుపరుస్తుంది.

ఎముకలను  పటిష్టం  చేస్తుంది.

కంటి చూపును  మెరుగుపరుస్తుంది.

నరాల  బలహీనత  రాకుండా  చేస్తుంది.


ఏ పండ్లతో  ఏ ప్రయోజనం

కడరాలు,  నరాల  బలహీనత  సమస్యలతో  బాధపడేవాళ్లు  జామకాయలు   తినాలి.

ప్రోస్టేట్  క్యాన్సర్ రాకుండా  ఉండాలంటే  తరచుగా   కూరల్లో  టమాటాలు  ఉండేలా  చూసుకోవాలి.

కిడ్నీల్లో  రాళ్లు  తొలగిపోవాలంటే  మామిడి పండ్లు  తినాలి.

కడుపులో  పురుగులు  పోవాలంటే  నేరేడు  పండ్లను  తినాలి.

గుండె,  చర్మ  సమస్యలకు  పుచ్చకాయ  చెక్  పెడుతుంది.

కీళ్ల నొప్పులకు  చెక్  పెట్టాలంటే  ద్రాక్ష పండ్లు  తినాలి.

పైల్స్  సమస్య  వేధిస్తుంటే  బొప్పాయి  తినాలి.



అధికంగా  బరువు  పెరగడానికి  కారణాలివే

శరీరంలో  అధికంగా  నీరు  చేరడం  ద్వారా  బరువు  పెరుగుతారు.  ఉప్పు  ఎక్కువగా  తినడం,  మద్యం  సేవించడం  వల్ల  శరీరంలోకి  నీరు  ఎక్కువగా  చేరుతుంది

జీర్ణ వ్యవస్థ  సరిగ్గా  పనిచేయక పోవడం.

నిద్ర సరిగ్గా  లేకపోవడం.

అధికంగా  ఒత్తిడికి  లోనవడం.

పోషకాలు  లభించే  ఆహారాలు  తినకపోవడం  ద్వారా  శరీరంలో  కొవ్వు  నిల్వలు  పెరిగి  బరువు  పెరుగుతారు.


"పొట్టను  తగ్గించుకోండిలా"

ఆహారంలో  విరివిగా  మిరపకాయలను  వాడటం  ద్వారా  పొట్ట  దగ్గర  కొవ్వు  కరుగుతుందని  నిపుణులు  అంటున్నారు.

క్యాలీఫ్లవర్,  క్యాబేజీని  ఆహారంలో  భాగం  చేసుకోవడం  వల్ల  వీటిలో  ఉండే  పీచు  పదార్ధాలు  పొట్టను  తగ్గిస్తాయి.

గుమ్మడితో  కూర  చేసుకుని  తినడం,  బూడిద గుమ్మడి  జ్యూస్ చేసుకుని  తాగడం  వల్ల  మంచి  ఫలితం  ఉంటుంది.

Post a Comment

0 Comments