ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లమంది గుండె జబ్బుల ముంగిట్లో.
కొద్ది రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల నుంచి గుండె జబ్బుకి దగ్గరలో ఉన్నారు. భారత్ తో సహా 43 దేశాలు ఆహార పదార్థాలలో చెడు కొవ్వుల నియంత్రణ గురించి నుంచి నియంత్రణలను పాటిస్తున్నప్పటికీ, 5 బిలియన్ ల ప్రజలు గుండె పోటుకు దగ్గరలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. తినే ఆహార పదార్థాలలో ఈ వేడు కొలెస్ట్రాల్ వల్ల డి లక్షల లక్షల premated deaths సంభవిస్తున్నాయి. FSSAI ఇండస్ట్రియల్ గా తయారైన చేను కొలెస్ట్రాల్ ను దూరంగా ఉంచగలిగితే 25 సంవత్సరాలలో 1.7 కోట్ల ప్రాణాలను రక్షించవచ్చును.
ఆహార పదార్ధాలలో ఉండే ట్రాన్స్ ఫాట్స్ నే మనం సాధారణ భాషలో చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తాము. ఇవి అధికబరువుకు, అధిక రక్తపోటుకు, కొన్ని రకాల క్యాన్సర్ లకు మరియు నేరుగా గుండె పోటుకు దారి తీస్తాయి. ఆహార పదార్థాల రుచి, సువాసన ఎక్కువకాలం ఉండడానికి packaged ఆహార పదార్థాల తయారీదారులు హైడ్రోజినేషన్ అనే ప్రక్రియను అవలంబిస్తారు. ఈ ప్రక్రియలో ఆయిల్ కు హైడ్రోజన్ ను కలిపి ఆహార పదార్థాల నిల్వ కాలాన్ని పెంచుతారు. మనం తినే packaged ఆహార పదార్థాలు, శీతలీకరించబడిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, వేపుడులు, తీపి పదార్థాలన్నింటిలో ఎంతో కొంత ట్రాన్స్ ఫాట్స్ ఉండి తీరుతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా వనస్పతి తో తయారు చేసే ఆహారపదార్థాలలో ఉంటుంది. ఆహార పదార్థాలను మితిమీరి వేడిచేయడం వల్ల ఇంట్లో తయారు చేసిన పదార్థాలైన లేదా హెూటల్స్ మరియు రెస్టారెంట్ల లో తయారుచేసిన పదార్థాలైన ఈ చెడు కొలెస్ట్రాల్ బారిన పడే అవకాశం చాల ఎక్కువగా ఉంటుంది.
ఈ ట్రాన్స్ ఫాట్స్ ను నిరోధించడం ఎలా...?
● ఆహార పదార్ధాలు కొనుగోలు చేసేటప్పుడు దాని లేబుల్ పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. Partially Hydrogenated Vegetable Oil లేదా Hydrogenated Vegetable Oil లేదా Shortening అని వ్రాసివుంటే అవి ట్రాన్స్ పాట్స్ ను అంటే చెడు కొలెస్ట్రాల్ ను కలిగి ఉన్నట్లేనని లెక్క.
● ప్యాకెట్ లేబుల్ పై ఉన్న పోషకాల సమాచారాన్ని తప్పనిసరిగా గమనించాలి పరిశీలిస్తే అందులో ట్రాన్స్ ఫాట్స్ ఉన్నాయో లేదో తెలిసిపోతుంది.
● బయట ఆహార పదార్ధాలు తినేటప్పుడు వనస్పతి తో తయారుచేసిన పదార్థాలు ముఖ్యంగా ఫ్రైస్, చాట్, సమోసా ,బతూరా, కేక్స్, కుకీస్, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండడం మేలు.
ఇంట్లో వండుకునేటప్పుడు:
• డీప్ ఫ్రైస్ కోసం ఆయిల్ ని మితిమీరి వేడి చేయవద్దు.
• వాడిన ఆయిల్ నే మళ్ళీ మళ్ళీ వాడడం చేయవద్దు.
• డీప్ ఫ్రైస్ కి వాడిన ఆయిల్ ని మళ్ళీ డీప్ ఫ్రైస్ కోసం వాడకుండా సాధారణ కూరలు చేసుకోవడానికి వాడుకోవచ్చును.
• డీప్ ఫ్రైస్ కోసం చిన్నచిన్న బాణలీలను వాడితే నూనె తక్కువగా పడుతుంది.
• Baked food items అనగా బిస్కెట్స్, కేక్స్, పఫ్స్ వంటివాటిని తక్కువగా తీసుకోవాలి.
0 Comments