GET MORE DETAILS

అధిక పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి ?

అధిక పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి ?



అధిక పొట్ట ఉంది అంటే దాని అర్థం మనకు అవసరమైన దాని కంటే ఎక్కువ తింటున్నాము, లేదా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావలసినంత కష్టపడుటలేము.

1. మనం చేస్తున్న పనికి తగ్గట్టు తినాలి. శారీరక శ్రమ చేసే వారికి ఎక్కువ ఆహారం కావాలి, ఆఫీసు లో కూర్చుని పని చేసే వారికి అంతా ఎక్కువ ఆహారం అవసరం లేదు. 

2. అధిక ఫైబర్ ఉన్న ఆహారం తినాలి ( జొన్నలు, చిరుధాన్యాలు, ఎక్కువ కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ) 

3. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి 

4. Intermittent ఫాస్టింగ్  అంటే రోజుకు రెండు సార్లు మాత్రమే , తక్కువ మోతాదులో తినడం.

5. ఎక్కువ నూనెలు, తీపి పదార్థాలు , తాలింపు పదార్థాలు తినకూడదు. 

● గమనించాల్సింది ఏంటంటే పొట్ట రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, తగ్గడానికి కూడా సమయం పడుతుంది. 

● కొన్ని నెలలు ప్రయత్నించి , పొట్ట తగ్గుట లేదు, అవి ఏవి పనిచేస్తాలేవు అంటే ఉపయోగం ఉండదు.

● పండ్లు తినవచ్చు, మిఠాయిలు తినకూడదు.

● పండ్లలో ఉండే తీయదనం గ్లూకోస్ తో పాటు ఫ్రూక్టోజ్, సుక్రోస్ వల్ల వస్తుంది. పండ్లలో ఉండే ఫైబర్ వల్ల గ్లూకోస్ చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. అది చాలా మంచిది. పండ్లలో ఇంకా చాలా విటమిన్ లు, పోషకాలు ఉంటాయి.

● ఖరీదైన పండ్లు కొన వలసిన అవసరం లేదు. మన దగ్గర ఏ ఏ ఋతువుల్లో చవకగా దొరికే పండ్లు రోజుకు ఒకటి లేదా రెండు తినడం చాలా మంచిది.

Post a Comment

0 Comments